AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ‘మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని’ .. ముంబై పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆయన ముంబైలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ పార్క్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మోడీ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు

PM Modi: 'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్
PM Narendra Modi
Basha Shek
|

Updated on: May 17, 2024 | 10:25 PM

Share

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆయన ముంబైలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ పార్క్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మోడీ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.ఈ సభకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన మోడీ.. మెమరబుల్ ముంబై.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ శివతీర్థ భూమిలో ఒకప్పుడు బాలా సాహెబ్ ఠాక్రే, వీర్ సావర్కర్‌ల గర్జన ఇక్కడ ప్రతిధ్వనించిందని, అయితే నేడు దేశద్రోహమైన ఇండీ అఘాదీని చూసి వారి ఆత్మలు ఎంత బాధపడుతున్నాయన్నారు. ఈ నకిలీ శివసేన వాళ్లు.. బాలా సాహెబ్‌కి, శివసైనికుల త్యాగాలకు ద్రోహం చేశారని, అధికారం కోసం రామ మందిరాన్ని దుర్వినియోగం చేసే వారితో కలిసి వెళ్లారని ప్రధాని మోదీ ఉద్దవ్ థాకరేపై మండి పడ్డారు.

‘ముంబై నగరం కలలు కనడమే కాదు. వాటిని సాకారం చేసుకుంటుంది కూడా. ఈ కలల నగరంలో నేను 2047 కలను తీసుకొచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి ఒక కల, సంకల్పం ఉందని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేసేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. ఈ ఎన్నికల ఫలితాలు గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టగలవని నేను మీకు హామీ ఇస్తున్నాను. జూన్ 4న భారతదేశం పెద్ద శక్తిగా అవతరిస్తుంది’ అని మోడీ పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ ట్వీట్..

ముంబయి సభలో ప్రధాని మోడీ, బీజేపీ నేతలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..