NOTA: నోటా నొక్కితే.. అభ్యర్థులే గల్లంతు.. ఫలితాలే తారుమారు.. నోటాకు అంత పవర్ ఉందా?

నోట్‌.. నోటా.. ఏది కావాలి. డబ్బు తీసుకుని మా పార్టీకి ఓటేస్తావా? తీసుకోకుండా నోటాకి వేస్తావా? తేల్చుకో ఓటరు మహాశయా. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం పైసా లేనిదే బయటికొచ్చే ప్రసక్తే లేదు. తమకు డబ్బు అందిందా ఓటు వేస్తాం.. లేకుంటే ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా డబ్బు తీసుకోం.. ఓటు మాత్రం వేస్తాం. అనేవారు మాత్రం నోటాకే ఎక్కువగా నొక్కుతున్నారు.

NOTA: నోటా నొక్కితే.. అభ్యర్థులే గల్లంతు.. ఫలితాలే తారుమారు.. నోటాకు అంత పవర్ ఉందా?
Nota Power
Follow us

|

Updated on: May 18, 2024 | 5:09 PM

నోట్‌.. నోటా.. ఏది కావాలి. డబ్బు తీసుకుని మా పార్టీకి ఓటేస్తావా? తీసుకోకుండా నోటాకి వేస్తావా? తేల్చుకో ఓటరు మహాశయా. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం పైసా లేనిదే బయటికొచ్చే ప్రసక్తే లేదు. తమకు డబ్బు అందిందా ఓటు వేస్తాం.. లేకుంటే ఇంట్లోనే ఉండిపోతాం. అలా కాకుండా డబ్బు తీసుకోం.. ఓటు మాత్రం వేస్తాం. అనేవారు మాత్రం నోటాకే ఎక్కువగా నొక్కుతున్నారు. ఈ నోటా వల్లే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మారిపోతున్నాయి. కొందరు అభ్యర్థుల భవిష్యత్‌ నిర్ణయించబడుతోంది. అంతపవర్‌ ఉంది ఈ నోటాలో. చివరికి పవన్‌ నోట కూడా నోటాపై ఆవేదన వ్యక్తమైందంటే.. పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

నోటా మీట.. నొక్కితే బాక్సు బద్దలవ్వాలి.. అభ్యర్థుల గుండెలు పగిలిపోవాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నామో.. వచ్చే కొద్ది నిమిషాల్లోనే అందరికీ అర్థం అవుతుంది. ఈవీఎం బాక్సుపై సైలెంటుగా చివరి స్థానంలో ఉండే నోటా… ఎంత వయొలెన్స్‌ని క్రియేట్‌ చేస్తోందో చాలామందికి తెలియదు. నోటా ఓట్లు పెరిగే కొద్దీ.. కొంత మంది అభ్యర్థుల అడ్రస్‌లు గల్లంతవుతుంటాయి.. పార్టీల పవర్‌ పడిపోతుంటుంది.. ప్రజాస్వామ్య పదును మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక్కో నోటా ఓటు ఎంత విలువైనదో.. ఎన్నికల్లో బరిలో దిగే పార్టీలను అడిగితే ఈజీగా చెబుతాయి. వంద నోటా ఓట్లు పోలైన నియోజకవర్గంలో.. 99 ఓట్ల తేడాతో ఓడిన అభ్యర్థిని అడిగితే ఆ కడుపులో ఉన్నదంతా కక్కుతారు. అంత పవర్‌ ఉంటుంది ఈ నోటాలో. ఏదో సినిమాలో నాతో అంత ఈజీ కాదని హీరోయిన్‌ చెబుతుంది. ఎన్నికల్లోనూ అంతే.. నోటాతో అంత ఈజీ కాదు. అభ్యర్థులకు రక్త కన్నీరు తెప్పిస్తున్న నోటా అసలు ఉండాలా వద్దా? నోటాకి ఓటు వేయాలా వద్దా?

నోటా… NOTA… None of the above. నాకు ఈ అభ్యర్థులెవరూ నచ్చలేదు. అందుకే నోటాకి ఓటు వేస్తున్నా అనేది ఓటర్‌ వాదన. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. నోటా ఓట్లు షాక్‌కు గురిచేస్తున్నాయి. కొంత మంది అభ్యర్థులను దారుణంగా ఓడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం లక్షా 68వేల ఓట్లు నోటాకి పడ్డాయంటే.. పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో నోటా ఓట్లు పోలయ్యాయి. చేవెళ్ల నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కేవలం 268 ఓట్లు.. అదే నోటాకి పోలైన ఓట్లు 1,423. దేవరకద్రలో ఆధిక్యం 1,392 అయితే.. నోటాకి వచ్చిన ఓట్లు 1,706. ఇక జుక్కల్‌, యాకుత్‌పురాలో ఆధిక్యానికి, నోటాకి పెద్ద తేడా లేదు. ఇలా తెలంగాణ ఎలక్షన్స్‌లో నోటా పవర్‌ చూపించింది. ఒకవేళ నోటానే లేకుంటే.. అదే ఓట్లు రెండో అభ్యర్థికి పడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. తెలంగాణలో 0.73శాతం నోటా ఓట్లు పోలయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీకి కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడా ఉంది. అంటే.. నోటా రోజు రోజుకు ప్రభుత్వాలను డిసైడ్‌ చేసే స్థాయికి ఎదుగుతోంది.

ఇంకాస్త ముందుకు పోతే.. 2019 ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో నోటా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో ఓట్లు నమోదయ్యాయి. మల్కాజ్‌గిరిలో 17వేలు, వరంగల్‌ ఎస్సీ నియోజకవర్గంలో 18వేలు, మెదక్‌, ఖమ్మంలో 15వేలు, గిరిజన నియోజకవర్గం అయిన ఆదిలాబాద్‌లో 13వేల నోటా ఓట్లు పడ్డాయంటే.. అక్కడి ప్రజల్లో, ఆ ఓటర్లలో ఎంత చైతన్యం ఉందో అర్ధం అవుతోంది. 2019 ఎంపీ ఫలితాల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి.. 10వేల 919ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. ఆ సమయంలో నోటాకి పోలైన ఓట్లు 17వేల 893. ఇక భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 5వేల219ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై నెగ్గితే, నోటాకి పోలైన ఓట్లు 12వేల 21. జహీరాబాద్‌లో 6,229ఓట్ల మెజార్టీతో గెలిచారు బీబీపాటిల్‌. ఆసమయంలో నోటాకి 11వేల 140 మంది నొక్కారు. అంటే.. ఈ నియోజకవర్గాల్లోనోటానే కీలకంగా మారింది.

నోటా అనే ఆప్షన్‌ లేకుంటే.. ఆసమయంలో ఫలితాలు తారుమారు అయ్యుండేవి కూడా. అంత పవర్‌ ఉంది ఈ నోటాకి. అందుకే నోటాతో అంత ఈజీకాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అభ్యర్థి వ్యతిరేక ఓట్లు, ఫ్రస్ట్రేటెడ్‌ ఓటర్స్‌ దీనికి నొక్కుతుండడం వల్ల ఫలితాలు తిరగబడుతున్నాయి. ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకుని ఓటేసే ప్రజలు 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. అటూ ఇటూగా సగటున 1 శాతం లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి. ఈ మధ్యన 2023 ఏడాది చివర్లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 1.5 శాతం ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా ఆ మేరకు ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేసినట్టు రికార్డవుతోంది.

ఇక నోటా బాధితులు ఎవరు? ప్రధాన పార్టీలా? చిన్న పార్టీలా? ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? అభ్యర్థుల తలరాతలు ఎలా మారుతున్నాయి అనేదానికి చిన్న ఉదాహరణే.. పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ. కొత్త పార్టీయే.. 2019లో తొలిసారి పోటీ చేసిన ఈ పార్టీ.. చాలా చోట్ల నోటా వల్ల బాధింపబడింది. పవన్‌ రెండు చోట్లా ఓడిపోవడానికి కారణం కూడా నోటా ఓటర్లే. అందుకే నోటాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌. నోటాకి ఓటేసే మేధావులు అంటూ ఆయన సంబోధించడం ఆయనలోని ఆక్రోషానికి తార్కాణం.

ఇలా అభ్యర్థులు నోటాపాట్లు పడుతున్నారు. అటు ఓటర్లను తమకు ఓటు వేయమని అభ్యర్థించడమే కాదు.. బాబ్బాబు నోటాకి మాత్రం ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2019లో ఏపీలోని 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి. బిజెపికి కేవలం 0.96 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెసుకు మాత్రం 1.29 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా, బీజేపీకి 0.84 శాతం, కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే జాతీయ పార్టీలను అంతగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. అవసరం అయితే నోటాకైనా నొక్కుతాం కానీ.. సదరు పార్టీలు అక్కర్లేదన్న వాదన కనిపిస్తోంది. ఈ నోటాతో తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంది బాధిత పార్టీలు, బాధిత అభ్యర్థులు కనిపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న అరకు పేరుతోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019 ఎన్నికల్లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ (ఎస్సీ) నియోజకవర్గంలో అత్యధికంగా ‘నోటా’కు ఓట్లు పోలైతే, ఆ తర్వాతి స్థానంలో అరకు(ఎస్టీ) రిజర్వ్ నియోజకవర్గం నిలిచింది. గోపాల్‌గంజ్‌లో 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, గిరిజన ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న అరకు లోక్‌సభ నియోజకవర్గంలో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2014లో అరకు నియోజకవర్గంలో ‘నోటా’కి 16,562 ఓట్లు రాగా, అది 2019 ఎన్నికల్లో సుమారు 48 వేలకు పెరిగింది. ఇది పాలకులపై ఓటర్లకున్న అసంతృప్తిని తెలియజేస్తోందంటున్నారు రాజకీయ వేత్తలు.

నిజానికి భారతదేశంలో EVMలు మొదటిసారిగా 1982లో కేరళలోని ఉత్తర పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అందుబాటులోకి వచ్చాయి. 2004 లోక్‌సభ ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా నిర్వహించడం జరగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని కొందరు వ్యక్తులు ఉంటారు.. అలాంటి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం “నోటా” సదుపాయాన్ని కల్పించింది. భారత ఎన్నికల సంఘం డిసెంబర్ 2013 అసెంబ్లీ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో చివరి ఆప్షన్‌ను “NOTA”గా ప్రవేశపెట్టింది.

2013కి ముందు కూడా నోటా సదుపాయం ఉన్నా.. దానికి పెద్ద ప్రాసెస్‌ ఉండేది. 2013 తర్వాత నోటా బటన్‌ వచ్చాక ప్రజల్లో అవగాహన భారీగా పెరిగింది. ఎన్నికల్లో పోటీ వ్యక్తులు నచ్చకపోవడం, అభ్యర్థుల నేర చరిత్ర, స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ఎవరికీ ఓటు వేయకూడదన్న ఓటర్లు నోటాకి నొక్కి.. తమ నిరసనను తెలియజేస్తున్నారు. 100 ఓట్లలో 99 నోటాకు పడి, ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే, ఆ అభ్యర్థి విజేతగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లు చెల్లనివిగా ప్రకటించడం జరుగుతుంది. ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయింది.

నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే, మిగతా అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితిలో అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహారాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇలాంటి సంస్కరణే తీసుకొచ్చి 2018లో స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. ఈ తరహా మార్పులు, సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అప్పటి వరకు నోటా అంటే ‘కోరల్లేని పులి’ మాత్రమే.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!