AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త.. రాష్ట్రంలో మెగా రైల్వే కారిడార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

తెలంగాణకు మరో శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు డీపీఆర్ ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. గ్రీన్ సిగ్నల్ లభించాక పనులు మొదలుకానున్నాయి. ఐదేళ్లల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వివరాలు చూస్తే..

Telangana: తెలంగాణకు కేంద్రం భారీ శుభవార్త.. రాష్ట్రంలో మెగా రైల్వే కారిడార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
Indian Railway
Venkatrao Lella
|

Updated on: Jun 08, 2026 | 3:07 PM

Share

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మరో మెగా కొత్త రైల్వే కారిడార్ ప్రకటించింది. రామగుండం-మనుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనుంది. ఈ మేరకు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నూతన రైల్వే లైన్ 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దీని నిర్మాణానికి దాదాపు రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని రైల్వేశాఖ అంచనా వేసింది. బోగ్గు, సిమెంట్, ఖనిజాలు, ఇతర లోహలతో పాటు ఆహార ధాన్యాలు, కోక్ వంటి సరుకు రవాణాకూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వేశాఖ అంచనా వేసింది. ఇది పూర్తై అందుబాటులోకి వస్తే దాదాపు ప్రతీ ఏటా రూ.460 కోట్ల ఆదాయం రైల్వేశాఖకు వచ్చే అవకాశముంటుందని తెలిపింది.

ఆదాయం ఎంత ఆదాయమంటే..?

ఇక ఏటా 12 మిలియన్ టన్నుల వరకు సరుకు రవాణా చేయవచ్చని. దీని ద్వారా ఆదాయం రూ.720 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వేలశాఖ కూడా అలైన్‌మెంట్ సర్వే, డీపీఆర్ పనులు పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులపై కేంద్రానికి పలుమార్లు వినతులు పంపింది. త్వరగా పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే పనులు మొదలుపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నూతన కారిడార్ వల్ల సింగరేణి బొగ్గు గనుల రవాణాకు ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడనుంది. దీని వల్ల దాదాపు 150 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని రైల్వేశాఖ చెబుతోంది. డీపీఆర్ ఇప్పటికే కేంద్రానికి సమర్పించగా.. త్వరలోనే ఆమెదం పొందే అవకాశముంది. అనంతరం ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా రవాణా వ్యవస్థకు కూడా ఉతమిస్తుంది.

పెరగనున్న కనెక్టివిటీ

ప్రస్తుతం కొత్తగూడెం నుంచి రామగుండం మధ్య బొగ్గు రవాణాకు డొర్నకల్, వరంగల్, రామగుండం సెక్షన్ మార్గం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కొత్త రైల్వే లైన్ వల్ల 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీని వల్ల బొగ్గు రవాణాకు అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఏడాదిలోగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇక సురుకు రవాణాతో పాటు ప్రయాణికులకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఒడిశా, ఢిల్లీ, చత్తీస్ గఢ్ వైపు వెళ్లే రైళ్లు భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రయాణించవచ్చు. దీని వల్ల దూరం తగ్గనుంది.

Follow Us