AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు.. 5,538 టీచర్లు, ఆయా పోస్టులకు వరుస నోటిఫికేషన్లు!

TG Teacher Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,769 ప్రీ-ప్రైమరీ సెక్షన్లలో 2,769 టీచర్ పోస్టులు, 2,769 ఆయా పోస్టులు కలిపి మొత్తం 5,538 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానుండగా, ఎంపికైన టీచర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 వేతనం అందజేయనున్నారు..

ప్రభుత్వ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు.. 5,538 టీచర్లు, ఆయా పోస్టులకు వరుస నోటిఫికేషన్లు!
TG Pre Primary Teacher Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 08, 2026 | 3:00 PM

Share

హైదరాబాద్‌, జూన్ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం మొత్త 2,769 ప్రీ-ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూళ్లలో టీచర్‌, ఆయా ఉద్యోగాల కోసం 5, 538 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 2,769 టీచర్ పోస్టులు, 2,769 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలలో నర్సరీ, LKG, UKG తరగతుల ఉపాధ్యాయులతో పాటు ఆయా పోస్టులు కూడా ఉన్నాయి.

ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ మేరకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో టీచర్లకు (ఇన్‌స్ట్రక్టర్లు) నెలకు రూ.8,000, ఆయాలకు నెలకు రూ.6,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా వారీగా వెలువడే ప్రకటనలను గమనించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. అంకితభావం గల ఉపాధ్యాయులను, సహాయక సిబ్బందిని నియమించడం ద్వారా చిన్నారులకు మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి ఇతర వివరాలు ఆయా జిల్లాల నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

Follow Us
ప్రభుత్వ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు.. 5,538 టీచర్లు, ఆయా పోస్టులు
ప్రభుత్వ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు.. 5,538 టీచర్లు, ఆయా పోస్టులు
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ ఛాన్స్..
శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ ఛాన్స్..
షాకింగ్‌ న్యూస్‌.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్‌ ధర.. ఎంతంటే?
షాకింగ్‌ న్యూస్‌.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్‌ ధర.. ఎంతంటే?
ఈ నాలుగు రాశుల వారికి నాగిని డ్యాన్స్.. ప్రతి రోజూ ప్రాణ సంకటమే..
ఈ నాలుగు రాశుల వారికి నాగిని డ్యాన్స్.. ప్రతి రోజూ ప్రాణ సంకటమే..
30 కోట్లతో తీస్తే రూ.132 కోట్ల కలెక్షన్స్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే
30 కోట్లతో తీస్తే రూ.132 కోట్ల కలెక్షన్స్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే
'మా ఇంటి బంగారం'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'మా ఇంటి బంగారం'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ధోనీ స్టైల్‌లో జర్నలిస్ట్‌కు చుక్కలు చూపించిన హర్మన్‌ప్రీత్ కౌర్
ధోనీ స్టైల్‌లో జర్నలిస్ట్‌కు చుక్కలు చూపించిన హర్మన్‌ప్రీత్ కౌర్
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.20 వేలు
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.20 వేలు