Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Returns: ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన మెడికల్ డివైజెస్ కంపెనీ.. రెండేళ్లలో ఊహించని రాబడులు..

Multibagger Returns: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్(Penny Stocks) లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు.

Multibagger Returns: ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన మెడికల్ డివైజెస్ కంపెనీ.. రెండేళ్లలో ఊహించని రాబడులు..
Multibagger Stock
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 10, 2022 | 11:55 AM

Multibagger Returns: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్(Penny Stocks) లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు. మార్కెట్లో అనుభవజ్ఞులు ఎప్పుడూ పెన్ని స్టాక్ చాలా రిస్క్ అయినవి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. కానీ ఆ రిస్క్ ను కాస్త తట్టుకొని మార్కెట్ ను స్టడీ చేస్తే పెన్నీ స్టాక్స్ కూడా సిరులు కురిపిస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే పాలీ మెడిక్యూర్ లిమిటెడ్(Poly Medicure Ltd) కంపెనీ స్టాక్.

ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు 250 శాతం మేర రిటర్నులను అందించింది. గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను తెచ్చిపెట్టింది. ఈ కంపెనీ డిస్పోజబుల్ మెడికల్ డివైజ్‌లను తయారీ వ్యాపారంలో ఉంది. ఇన్‌ఫ్యూజర్ థెరపీ, బ్లడ్ మేనేజ్‌మెంట్, గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జరీ, అనెస్థీషియా, యూరాలజీ వంటి అనారోగ్యాల్లో చికిత్సకు వినియోగించే వివిధ ప్రొడక్టులను కంపెనీ తయారు చేస్తుంటుంది. ఇది దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ వ్యాపారాలను సాగిస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 27న జరిగిన ఓ ఈవెంట్‌లో కంపెనీ ‘‘ఇండియా మెడికల్ డివైజ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’’ను కైవసం చేసుకుంది.

S&P BSE- 500 బెంచ్‌మార్కుతో పోలిస్తే ఈ కంపెనీ షేర్ మూడింతలు రిటర్నులను అందించింది. మే 11, 2020న కంపెనీ షేర్ ధర రూ.233.80గా ఉంది. రెండేళ్లలోనే 254 శాతం కంపెనీ షేరు ధర పెరిగింది. అంటే రెండేళ్ల క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలను ఇన్వెస్ట్ చేసుంటే.. ప్రస్తుతం రూ.3.54 లక్షలు అయ్యుండేవి. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి షేర్ సుమారు రూ. 777 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల కనిష్ఠం రూ. 688 ఉండగా.. 52 వారాల గరిష్ఠం రూ.1163గా ఉంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Interest Rates: వడ్డీ రేట్లలో మార్పులు చేసిన బ్యాంకులు ఇవే.. కస్టమర్లకు పెంపు ఎప్పటి నుంచి అమలవుతుందంటే..

Fixed Deposits: సీనియర్‌ సిటిజన్స్‌కు అండగా నిలుస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌.. అధిక వడ్డీ రేటు