Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలు

Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో మే 10న మంగళవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు..

Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలు
Follow us

|

Updated on: May 10, 2022 | 10:58 AM

Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో మే 10న మంగళవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇండియన్ ఆయిల్ (Indian Oil) మార్కెటింగ్ కంపెనీలు. ఏప్రిల్ 7 నుంచి జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగలేదు. గతంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు జాతీయ స్థాయిలో 14 విడతలుగా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.10-10 పెరిగాయి. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలో వందకుపైగా కొనసాగుతున్న ధరలను మరింతగా తగ్గించాలని కోరుతున్నారు.

తాజా ధరలు ఇలా ఉన్నాయి

☛ ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.67 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.105.49గా ఉంది

☛ ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.51 ఉండగా, డీజిల్ రూ.104.77గా ఉంది.

☛ కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.12 ఉండగా, డీజిల్‌ ధర రూ. 99.83 ఉంది.

☛ చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.110.85 ఉండగా, డీజిల్ రూ.100.94 ఉంది.

కాగా, వివిధ రాష్ట్రాల్లో వాహన ఇంధనంపై వివిధ రకాల వ్యాట్‌లు ఉన్నందున, నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పులుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా, భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు.  మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పంపితే ధరల వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి