మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకం.. 3 లక్షల రుణ సదుపాయం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
Fishermen: రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో
Fishermen: రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రారంభించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) అమలు చేస్తుంది. మత్స్యకారులకు చేపల పెంపకం ఒక జీవనొపాది. అందుకే చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు. నాలుగో అతిపెద్ద చేపల ఎగుమతిదారు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు చేపల పెంపకంతో సంబంధం కలిగి ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మత్స్య సంపద యోజనను ప్రారంభించింది.
ఈ పథకం 2024-25 వరకు వర్తిస్తుంది ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అంచనా వ్యయం రూ.20,050 కోట్లు. మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, మత్స్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.నీలి విప్లవం ద్వారా దేశంలో మత్స్య రంగం స్థిరమైన, జవాబుదారీ అభివృద్ధిని నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 5 సంవత్సరాలు అమలు చేస్తారు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వర్తిస్తుంది. ఈ పథకంతో మత్స్య రంగంలోని తీవ్రమైన లోపాలను తొలగిస్తారు. సంవత్సరానికి 9 శాతం చొప్పున మత్స్య రంగం పెంపుతో 2024-25 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతుంది.
చేపల పెంపకానికి నాణ్యమైన విత్తనాల సేకరణ, మెరుగైన నీటి నిర్వహణ ఈ పథకం ద్వారా కల్పిస్తారు. ఈ పథకం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానించబడిన ప్రజలందరికీ మెరుగైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఇది మత్స్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. 2024 నాటికి మత్స్య పరిశ్రమతో సంబంధం ఉన్న రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఈ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చు? పీఎంఎంఎస్‌వై కింద ప్రభుత్వం రూ.3 లక్షల రుణం ఇస్తుంది. మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల విక్రయదారులు, మత్స్య అభివృద్ధి కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాలు, మత్స్య రంగం, మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార సంఘాలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ సంస్థలు, మత్స్య ఉత్పత్తిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, చేపల పెంపకం కార్డు, నివాస ధృవీకరణ పత్రం, సంప్రదింపు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, దరఖాస్తుదారు కుల ధృవీకరణ పత్రం. ఈ పత్రాలతో PMMSYలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ pmmsy.dof.gov.inకి వెళ్లాలి. అందులో దరఖాస్తు చేసుకోవాలి.