బూస్టర్ డోస్ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్ 31లోపు మాత్రమే..?
Covid 19 Vaccine: USలోని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో నగర పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి
Covid 19 Vaccine: USలోని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో నగర పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పొందిన పౌరులక నగదు బహుమతి ప్రకటించారు. వారికి100 డాలర్లు (దాదాపు రూ. 7,568) ఇస్తారని తెలిపారు. ఈ రివార్డ్‌కు అర్హులైన వ్యక్తులు మూడో డోస్ టీకాను డిసెంబరు 31లోపు వేయించుకోవాలని సూచించారు. న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయం ట్వీట్ చేస్తూ..
‘ఇది గొప్ప అవకాశం. బూస్టర్ డోస్ పొందండి మీ కుటుంబాన్ని నగరాన్ని రక్షించుకోండి’ అని రాసింది. దీనికి ముందు జూలైలో కూడా న్యూయార్క్ నగరంలో సిటీ-రన్ సైట్‌లో టీకా మొదటి డోస్ పొందిన వ్యక్తులకు $100 డాలర్లు ఇచ్చారు. ఈ డబ్బు ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్ ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా అందిస్తున్నారు. యుఎస్‌లో కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల న్యూయార్క్ నగరంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు.
గత ఏడు రోజులుగా న్యూయార్క్ నగరంలో సగటున 9,300 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని డి బ్లాసియో ఒక వార్తా సమావేశంలో తెలిపారు. రాబోయే కొద్ది వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. Omicron వేరియంట్ కేసులు USలో వేగంగా పెరుగుతున్నాయి. గత వారం 75 శాతం కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు కనుగొన్నారు. CDC గణాంకాల ప్రకారం.. కేవలం ఒక వారంలో Omicron కేసులు దాదాపు ఆరు రెట్లు పెరిగాయని చూపుతున్నాయి. న్యూయార్క్ ప్రాంతంలో కొత్త ఇన్ఫెక్షన్ కేసుల్లో 90 శాతం ఓమిక్రాన్‌గా నిర్ధారించారు. CDC ప్రకారం.. జూన్ చివరి నుంచి దేశంలో ఇన్ఫెక్షన్ కేసులకు డెల్టా వేరియంట్ కారణమైంది. నవంబర్ చివరి నాటికి డెల్టా వేరియంట్ కారణంగా 99.5 శాతానికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.