’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

CM Arvind Kejriwal: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణవీర్‌ సింగ్‌ నటిస్తున్న తాజా చిత్రం '83'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో

'83' సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌
Movie 83
Follow us
uppula Raju

|

Updated on: Dec 21, 2021 | 10:43 PM

CM Arvind Kejriwal: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణవీర్‌ సింగ్‌ నటిస్తున్న తాజా చిత్రం ’83’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఢిల్లీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. ANI చేసిన ట్వీట్ ప్రకారం.. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వరల్డ్‌ కప్‌ సాధించింది. ఈ విజయాన్ని వర్ణిస్తూ రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా 83 సినిమా తెరకెక్కించారు. దేశానికి గర్వకారణమైన ఈ మధుర క్షణాలను అందరు చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పన్ను మినహాయింపు ప్రకటించారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థలో ఒకటైన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా సంతోషంగా ఉంది.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలకు కృతజ్ఞతలు తెలిపింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తన ట్వీట్‌లో ఇలా రాసింది. ‘అరవింద్ కేజ్రీవాల్ జీ, మనీష్ సిసోడియా జీ, ఢిల్లీలో 83 చిత్రాన్ని పన్ను లేకుండా చేసినందుకు ధన్యవాదాలు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఈ సినిమాని భారతీయులందరికి చేరవేయడానికి సహాయపడుతుంది’ అని రాశారు. లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు చరిష్మా ప్రదర్శించిన చారిత్రాత్మక ఘట్టం అది. కపిల్ దేవ్ సారథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిన భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌తో తిరిగి వస్తుందని ఎవరూ అనుకోలేదు.

1983 ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా అందులో పాల్గొన్న నిజమైన స్టార్‌ల కథను అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. కబీర్ ఖాన్ 83 చిత్రం ద్వారా ఈ రియల్ స్టార్ల కథను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రికెటర్లుగా అనుభవజ్ఞులైన తారాగణం కనిపించింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, దీపికా పదుకొణె, అమీ విర్క్, హార్డీ సంధు, చిరాగ్ పాటిల్, తాహిర్ రాజ్ భాసిన్ వంటి పలువురు నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్, పాటలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిసెంబర్ 24న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

Amla Benefits: ఉసిరిని ఇలా తీసుకుంటే అద్భుతమైన రుచి.. అంతకు మించిన ఆరోగ్యం..

Viral video: గేదె చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఆ మూగజీవి ఏం చేసిందంటే..

Phone Tapping: మళ్ళీ చర్చలో ఫోన్ ట్యాపింగ్ అంశం.. అసలు ఇదేమిట్? ప్రభుత్వం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలదా?