Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: గేదె చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఆ మూగజీవి ఏం చేసిందంటే..

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న' అన్న మాటలు పెదాల వరకే పరిమితమై పోతుంటాయి చాలామందికి. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు కూడా మనకెందుకులే అని వదిలేస్తుంటారు

Viral video: గేదె చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.. ఇంతకీ ఆ మూగజీవి ఏం చేసిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 21, 2021 | 10:06 PM

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మాటలు పెదాల వరకే పరిమితమై పోతుంటాయి చాలామందికి. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు కూడా మనకెందుకులే అని వదిలేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మూగ జీవాలు మాత్రం తమ మధ్య ఉన్న జాతి వైరాన్ని మర్చిపోతుంటాయి. ఇతర జంతువులకు చేతనైన సహాయం చేస్తుంటాయి. ఈ మాటలను నిరూపిస్తూ ఇటీవల ఎన్నో అరుదైన సంఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. సాధారణంగా గేదెలను చాలామంది తక్కువగా చూస్తుంటారు. ఎందుకంటే వాటికి కోపమెక్కువని, ఏమైనా తేడావస్తే ఎదుటివారిపై దారుణంగా దాడిచేస్తాయనుకుంటారు. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వాటితో ‘జల్లికట్టు’ పోటీలను నిర్వహిస్తుంటారు.

అయితే ఇక్కడ మాత్రం.. ఒక గేదె తనకు ఎదురుగా ఉన్న మరొక మూగజీవికి సహాయం చేసింది. కోపం వచ్చినప్పుడే ఎదుటివారిని కుమ్మే కొమ్ములతోనే ఆ జంతువుకు ఆపన్నహస్తం అందించింది. ప్రస్తుతం ఈ గేదెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయింది. అయితే దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలును పైకి లేచేలా చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ఓ టిక్‌టాక్‌ యూజర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే నోరులేని మూగజీవాలే నయం’, ‘వీడియో అద్భుతంగా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

Viral video: ఈల్‌ చేపను మింగేద్దామనుకున్న మొసలి.. కరెంట్ షాక్‌తో మృత్యువాత.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Viral video: గేదెపై రాజసంగా శునకం సవారీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Digital News Round Up : పుష్ప దండయాత్ర | కోపంతో కోట్ల రూపాయల కారును పేల్చేశాడు.. లైవ్ వీడియో