AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఈల్‌ చేపను మింగేద్దామనుకున్న మొసలి.. కరెంట్ షాక్‌తో మృత్యువాత.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

కరెంట్‌ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. కానీ టచ్‌ చేస్తే దానమ్మ షాకే' అంటూ 'ఊసరవెల్లి' సినిమాలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఎంతో ఫేమస్‌. ఇప్పుడీ డైలాగ్‌ ఎందుకంటే .. ఈ

Viral video: ఈల్‌ చేపను మింగేద్దామనుకున్న మొసలి.. కరెంట్ షాక్‌తో మృత్యువాత.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Basha Shek
|

Updated on: Dec 21, 2021 | 9:39 PM

Share

‘కరెంట్‌ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. కానీ టచ్‌ చేస్తే దానమ్మ షాకే’ అంటూ ‘ఊసరవెల్లి’ సినిమాలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఎంతో ఫేమస్‌. ఇప్పుడీ డైలాగ్‌ ఎందుకంటే .. ఈల్‌ చేప కూడా తన కరెంట్‌ షాక్‌తో ఏకంగా ఓ మొసలిని అంతమొందించింది. ఈల్ చేపలు ఎంతో ప్రమాదం. వాటి జోలికి ఎవరైనా వస్తే అవి కరెంట్ విడుదల చేస్తాయి. అది మామూలు కరెంటు కూడా కాదు. దాదాపు 860 వోల్టుల కరెంట్‌. దీని కారణంగా షాక్ తగిలితే ప్రాణం గాల్లో కలిసిపోవడం ఖాయం. అయితే ఈ విషయం తెలియని ఓ మొసలి ఇతర జంతువుల్లాగే ఈల్‌ చేపను కూడా నోట కరుచుకుంది. అమాంతం మింగేద్దామని ప్రయత్నించి మృత్యువాత పడింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో చెరువులో దిమ్మలాగా కదలకుండా ఉంటుంది. అంతలో ఓ ఈల్‌ చేప అటువైపు వస్తుంది. నీటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇదే సరైన సమయం అనిపించిన మొసలి ఆ చేపను నోట కరుచుకుంటుంది. అయితే వెంటనే ఈల్‌ చేప నుంచి కరెంట్‌ ప్రసరిస్తుంది. దీంతో… మొసలి గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. అయితే అలా కొట్టుకునే సమయంలో… మొసలి తల ఈల్ చేపపై బలంగా పడుతుంది. ఈ క్రమంలో కాసేపటికి మొసలి చనిపోయిన కాపేపటికే… ఈల్ చేప కూడా చనిపోతుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:

Viral video: గేదెపై రాజసంగా శునకం సవారీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Aadi Saikumar: ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు.. ఆసక్తికరంగా ‘అతిథి దేవోభవ’ టీజర్‌..

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?