Aadi Saikumar: ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు.. ఆసక్తికరంగా ‘అతిథి దేవోభవ’ టీజర్‌..

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌

Aadi Saikumar: ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు.. ఆసక్తికరంగా 'అతిథి దేవోభవ' టీజర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 21, 2021 | 9:40 PM

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌. ఈ ఏడాది ‘శశి’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన అతని చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ‘జంగిల్‌’, ‘కిరాతక’, ‘బ్లాక్‌’ సినిమాలతో పాటు ‘అతిథి దేవోభవ’ అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నువేక్ష ఆది సరసన సందడి చేయనుంది. కొత్త దర్శకుడు పొలిమేర నాగేశ్వర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మంగళవారం ‘అతిథి దేవోభవ’ టీజర్‌ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో కూడిన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

టీజర్‌ చూస్తుంటే సినిమాలో ఏదో అనారోగ్య సమస్యతోనో లేదా లోపంతోనో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగులు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘రాముడికి లక్ష్మణుడు వెంట ఉన్నట్లే నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది’, ‘ఒకరు చెప్పాడని ఇంకొకడితో చేయించేవాడు కాదురా.. ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు’ అంటూ ఆది నోటి డైలాగులు బాగా పేలాయి. కాగా త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Also Read:

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

Rajamouli: పవన్‌, మహేష్‌, దిల్‌రాజుకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన జక్కన్న.. ఎందుకో తెలుసా.?

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?