AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

Nani Dasara Movie: వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పటికే శ్యామ్‌సింగ్ రాయ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు..

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 21, 2021 | 9:46 PM

Share

Nani Dasara Movie: వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పటికే శ్యామ్‌సింగ్ రాయ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు విడుదలకు ముందే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు నాని. ‘సుందరానికి’ సినిమా సెట్స్‌పైకి వెళ్లిందో లేదో.. ‘దసరా’ అనే చిత్రాన్ని కూడా మొదలు పెట్టారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో మరో హీరోయిన్‌గా నిత్యా మీనన్‌ కూడా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక సినిమా పోస్టర్‌ను విడుదల చేసే క్రమంలో నాని తెలంగాణ యాసలో పలికిన డైలాగ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తికి పెంచేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ‘దసరా’ మేకర్స్‌ కాస్టింగ్‌ కాల్‌కు ఆహ్వానించారు. తెలుగు మాట్లాడే నటీనటులు ఎంపిక కోసం ప్రకటన జారీ చేశారు. ఆసక్తి ఉన్న తెలుగు రాష్ట్రాల నటీ, నటులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇందులో భాగంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు, 08 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు ఈ అవకాశం కల్పించారు. dasaracasting@gmail.comకి వీడియోలు పంపించాలని తెలిపారు. అయితే టిక్‌టాక్‌ వీడియోలు, ఇన్‌స్టారీల్స్‌ పరిగణలోకి తీసుకోమంటూ స్పష్టం చేశారు. చివరి తేదీగా 31-12-2021ని నిర్ణయించారు. ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Nani Dasara

Also Read: Home Guards Salaries: హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!

OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..