AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యాడు. అతను ఆస్పత్రిలో ఉండగానే 'రిపబ్లిక్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?
Basha Shek
|

Updated on: Dec 21, 2021 | 9:41 PM

Share

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యాడు. అతను ఆస్పత్రిలో ఉండగానే ‘రిపబ్లిక్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్‌1న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజై మంచి ఆదరణ పొందింది. అయితే సాయి ధరమ్‌ తర్వాతి ప్రాజెక్టు ఎంటన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోన్న ఈ మెగా హీరో కొత్త ఏడాదిలోనైనా తన కొత్త సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. ఇందుకోసం కథలు కూడా వింటున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే సుకుమార్‌ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వంలో నటించాల్సిన సినిమా షూటింగ్‌ను ప్రారంభించే పనిలో ఉన్నాడు సాయి ధరమ్‌.

కాగా ఇటీవల తమిళంలో శింబు హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘మానాడు’ తెలుగు రీమేక్‌లోనూ ఈ మెగాహీరో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్నిచేకూరుస్తోంది. తాజాగా సాయితేజ్‌ సినిమా దర్శకుల జాబితాలోకి సంపత్‌ నంది వచ్చాడు. ఇటీవల ‘సిటీమార్‌’ హిట్‌ కొట్టిన ఈ దర్శకుడితో సాయి సినిమాను పట్టాలెక్కించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోందట. ఈ కాంబినేషన్‌లో ఓ మాస్‌ చిత్రాన్ని రూపొందించడంపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

Also Read:

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

VJ Sunny: బిగ్‌బాస్‌ విజేత సన్నీతో… మాట ముచ్చట.. లైవ్ వీడియో

Nivetha Pethuraj: వావ్ అనిపిస్తున్న నివేథా పేతురాజ్ గ్లామరస్ ఇమేజస్