Viral Video: పిల్లని కొరికితే తల్లి ఊరుకుంటుందా.. తరిమి తరిమి కొడుతుంది.. షాకింగ్ వీడియో..
Viral Video: అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని జంతువులు చాలా ప్రమాదకరమైనవి. సింహం, పులిలాంటి జంతువులు

Viral Video: అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని జంతువులు చాలా ప్రమాదకరమైనవి. సింహం, పులిలాంటి జంతువులు వేటపై ఆధారపడి బతుకుతాయి. అయితే అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. తాజాగా చిరుతపులి, అడవి పందికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం.
మీరు అడవి పందులను చూసే ఉంటారు. అవి కూడా ప్రమాదకర జంతువులే. వాటిని వేటడానికి వచ్చిన క్రూర జంతువులకు చుక్కలు చూపెడుతాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇలాంటి దృశ్యమే కనిపిస్తోంది. ఒక చిరుతపులి అడవి పంది పిల్లని వేటాడాలనుకుంటుంది. మాటువేసి పంది పిల్లని నోటితో పట్టుకునిపోవడం మనం వీడియలో గమనించవచ్చు. తర్వాత పందిపిల్ల అరుస్తూ ఉంటుంది. ఇంతలో తల్లి పంది గమనిస్తుంది. వెంటనే చిరుతపులిని వేగంగా వెంబడిస్తుంది. పరుగులు పెట్టిస్తుంది. పరిస్థితి విషమించడంతో చిరుత పంది పిల్లను అక్కడే వదిలేసి పారిపోతుంది. అనంతరం తల్లి పంది చిరుతని చాలాదూరం తరిమికొట్టడం మనం వీడియోలో చూడవచ్చు.
అడవిని సందర్శించే పర్యాటకులు ఈ వీడియోను చిత్రీకరించారు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్_యానిమల్స్_ఆఫ్_దివరల్డ్ అనే IDతో షేర్ చేశారు. కేవలం 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని ఇప్పటి వరకు 94 వేల మంది వీక్షించారు. అదే సమయంలో చాలా మంది వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఒక వినియోగదారు ‘చిన్నవారిపై దాడి చేస్తాడు కానీ పెద్దవాడికి భయపడతాడు’ అని రాశారు. అయితే చాలా మంది వినియోగదారులు ఫన్నీ కామెంట్‌లు చేశారు.
View this post on Instagram