Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tapping: మళ్ళీ చర్చలో ఫోన్ ట్యాపింగ్ అంశం.. అసలు ఇదేమిట్? ప్రభుత్వం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలదా?

చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల రంగంలో తమ పక్షాన్ని బలోపేతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి.

Phone Tapping: మళ్ళీ చర్చలో ఫోన్ ట్యాపింగ్ అంశం.. అసలు ఇదేమిట్? ప్రభుత్వం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలదా?
Phone Tapping
KVD Varma
|

Updated on: Dec 21, 2021 | 10:05 PM

Share

Phone Tapping: చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల రంగంలో తమ పక్షాన్ని బలోపేతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. పార్టీల వారీగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికంతో పాటు మరో అంశంపై ఎక్కువగా ప్రస్తావన వస్తోంది. అదే ఫోన్‌ ట్యాపింగ్‌. దాదాపుగా విపక్షాలన్నీ ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది ఫ్రంట్‌లైన్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను ముఖ్యమైనవిగా పరిగణించి పరస్పరం మటల దాడులు చేసుకుంటున్నారు. కానీ, ఇంతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటో తెలుసా? భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ గురించి చట్టం ఏమి చెబుతుందో.. చట్టంలోని ఫోన్ ట్యాపింగ్ హక్కుకు వ్యతిరేకంగా, దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలుసుకోవడం అవసరం..

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?

ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదైనా ఫోన్ సంభాషణను ఎవరైనా మూడో వ్యక్తి చదవడం లేదా వినడం. ఉదాహరణకు, మీరు..మీ స్నేహితులు ఫోన్‌లో మాట్లాడుతున్నారనుకోండి.. మీ అనుమతి లేకుండా మీ ఫోన్ కాల్‌ని ఎవరైనా మూడవ వ్యక్తి రికార్డ్ చేసారని అనుకుందాం.. అప్పుడు అది ఫోన్ ట్యాపింగ్. కానీ, ఫోన్ ట్యాపింగ్‌లో, సంభాషణలో పాల్గొన్న వ్యక్తి భిన్నంగా ఉంటాడు, అంటే, సంభాషణలో పాల్గొన్న వ్యక్తులు కాకుండా మరొకరు మీ సంభాషణను చదివితే, దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. చాలా మంది దీనిని వైర్ ట్యాపింగ్ లేదా లైన్ బగ్గింగ్ అని కూడా పిలుస్తారు.

భారతదేశంలో ఇది చట్టవిరుద్ధమా?

మనం భారతదేశం విషయానికి వస్తే..అది ఇక్కడ చట్టవిరుద్ధం. సంభాషణలో పాల్గొన్న వ్యక్తి కాకుండా మరొకరు మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేస్తే, అది చట్టవిరుద్ధం. ప్రభుత్వం కూడా మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయదు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయదు. ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రక్రియ అనుసరించి మాత్రమె ఆ పని చేయగలదు.

చట్టం ఏం చెబుతోంది?

వాస్తవానికి, ఎవరైనా మీ ఫోన్‌ను ట్యాప్ చేస్తే, అది మీ హక్కులలో ఒకదానిని ఉల్లంఘిస్తుంది. అది గోప్యత హక్కు. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీ హక్కును ఎవరూ ఉల్లంఘించలేరు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2)లో ఫోన్ ట్యాపింగ్ గురించి స్పష్టంగా ఉంది. దీనికి ఉదాహరణగా 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వం ఫోన్‌ను ఎప్పుడు ట్యాప్ చేయగలదు?

ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం, ప్రభుత్వం కొన్ని పరిస్థితుల్లో ఫోన్‌ను ట్యాప్ చేయవచ్చు. చట్టంలోని సెక్షన్లు (1) మరియు (2) ప్రకారం..అది పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయమైతే, ప్రభుత్వం అలా చేయవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం అనేక రకాల ఆమోదాలు తీసుకోవాల్సి ఉంటుం. కోర్టు అనుమతి తర్వాత ఇలా చాలాసార్లు చేయవచ్చు. ఒకవేళ ఎవరికైనా తమ ఫోన్ అక్రమంగా ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్టు అనుమానం ఉంటే.. అది నిజమని తేలితే.. వారు కోర్టును ఆశ్రయించవచ్చు. మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..