Omicron విధ్వంసం.. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ పార్టీలు రద్దు..! పెద్దల కంటే పిల్లలకు ప్రాణాంతకం..

Omicron: ప్రపంచంలోని దేశాలతో పాటు ఇండియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 11 ఓమిక్రాన్ కేసులు

Omicron విధ్వంసం.. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ పార్టీలు రద్దు..! పెద్దల కంటే పిల్లలకు ప్రాణాంతకం..
Covid 2
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 22, 2021 | 6:55 AM

Omicron: ప్రపంచంలోని దేశాలతో పాటు ఇండియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 11 ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కి చేరింది. ఓమిక్రాన్ జమ్మూలో కూడా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 200 ఓమిక్రాన్ కేసులను గుర్తించారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ దేశ పార్లమెంటుకు చేరుకోవడం కూడా ఆందోళన కలిగించే విషయం. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిన్నటి వరకు ఆయన సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గోవాలో బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన నలుగురు ప్రయాణీకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు కొత్త ఓమిక్రాన్ కేసులు కనుగొన్నారు. అదే సమయంలో ఐఐటి బాంబేకి చెందిన 7 మంది విద్యార్థులు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఓమిక్రాన్‌కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు న్యూ ఇయర్ పార్టీలు, ఈవెంట్‌లను నిషేధించింది. ఓమిక్రాన్ బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికాలో సంచలనం సృష్టించింది. UKలో 10,000 కంటే ఎక్కువ మంది కొత్త రోగులలో ఓమిక్రాన్ వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రికి చేరుకునే రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వారిలో ఐదేళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు. ఓమిక్రాన్ పెద్దల పిల్లలకు 20 శాతం ఎక్కువ ప్రాణాంతకం.

క్రిస్మస్ వేడుకలను రద్దు చేయాలని WHO విజ్ఞప్తి గత వారం కంటే ఈసారి 39 శాతం ఎక్కువ మంది పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అమెరికా పరిస్థితి ఏంటంటే డెల్టా స్థానంలో ఓమిక్రాన్ ప్రధాన వేరియంట్‌గా మారింది. డెన్మార్క్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, క్రిస్మస్ వేడుకలను రద్దు చేయాలని WHO చీఫ్ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేశారు. సంతాపం చెప్పడం కంటే సంబరాలు చేసుకోకపోవడమే ఉత్తమం అన్నారు. Omicron దృష్ట్యా నెదర్లాండ్స్ ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను నిషేధించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అనవసర దుకాణాలు, బార్‌లు, రెస్టారెంట్లు జనవరి 14 వరకు మూసివేస్తున్నారు. డెన్మార్క్‌లో మ్యూజియంలు కూడా మూసివేశారు.

ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లలో ముందస్తు జాగ్రత్తలు ఆస్ట్రేలియాలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. న్యూ సౌత్ వేల్స్‌లో తొలిసారిగా ఒక్క రోజులోనే 3000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీని కారణంగా బూస్టర్ డోస్‌ను విడుదల చేయాలని ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్‌పై ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా విక్టోరియాలో 1245 కొత్త రోగులను కనుగొన్నారు. ఒమిక్రాన్ ముప్పు మధ్య, థాయిలాండ్ కూడా విదేశీ ప్రయాణికులకు తప్పనిసరి నిర్బంధాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఇజ్రాయెల్‌లో కరోనా ఐదో వేవ్‌ మధ్య అమెరికా నుంచి ప్రయాణాన్ని నిషేధించారు.

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..