Covid 19 Omicron: డబుల్ సెంచరీ దాటిన ఒమిక్రాన్ కేసులు.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. 200 పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు వేగంగా సంక్రమిస్తోందని , అలర్ట్‌గా ఉండాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.
Union Govt. on Covid 19 Omicron: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. 200 పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు వేగంగా సంక్రమిస్తోందని , అలర్ట్‌గా ఉండాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. వరల్డ్ వైడ్‌గా సౌతాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. డెల్టా కంటే జెట్ స్పీడ్‌తో ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే 94 దేశాలకు పాకింది.
ఒమిక్రాన్ వేరియంట్ మనదేశంపైనా పంజా విసిరింది. రెండు వందలను క్రాస్ చేసింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య. దేశంలో ఒమిక్రాన్ కేసులు 2 వందలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ మరణం నమోదయ్యింది. టెక్సాస్‌లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 215 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో కర్ణాటక రాష్టర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈనెల 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిషేధించారు. 50 శాతం కెపాసిటీతో పబ్‌లు , బార్లలో వేడుకలకు అనుమతి ఇచ్చారు. రెండు డోసులు తీసుకోని వాళ్లను వేడుకలకు అనుమతించరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు వేగంగా సంక్రమిస్తుందని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఒమిక్రాన్ నియంత్రణకు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఒమిక్రాన్‌తో పాటు దేశంలో ఇప్పటికి కూడా డెల్టా వేరియంట్ విస్తరిస్తుందని కూడా కేంద్రం హెచ్చరిచింది. స్థానికంగా ముఖ్యంగా జిల్లాల్లో దీని నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. కంటెన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు.
ఒమిక్రాన్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలను లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సంబంధమైన సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది.
Letter by Union Health Ministry to states regarding measures that need to be taken in view of initial signs of surge in cases of #COVID19 as well as increased detection of the Variant of Concern (VoC), #Omicron in different parts of the country .@fpjindia pic.twitter.com/mIBovLgCJc
— Sanjay Jog (@SanjayJog7) December 21, 2021
ఇదిలావుంటే, తాజాగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 215కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించగా.. అధిక కేసులు నమోదైన తొలి మూడు రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (65), డీల్లీ (54), తెలంగాణ (24) ఉన్నాయి. అలాగే, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూశాయి. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది కోలుకున్నట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read Also…. Health: చలికాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.? క్యారెట్‌తో ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది.