Omicron: కరోనా కొత్త వేరియంట్ కు మందు సిద్ధమన్న నెల్లూరు ఆనందయ్య.. పంపిణీ ఎప్పటినుంచంటే..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని నెల్లూరు ఆనందయ్య టీవీ 9తో తెలిపారు. గతంలో తయారుచేసిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఈ మందును తయారుచేశామని
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని నెల్లూరు ఆనందయ్య టీవీ 9తో తెలిపారు. గతంలో తయారుచేసిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఈ మందును తయారుచేశామని, ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో నెల్లూరు ఆనందయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా పేదలందరికీ తన మందును ఉచితంగా అందిస్తామని ఆనందయ్య పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో కావాలంటే మాత్రం ప్రత్యేకంగా తయారుచేసిస్తామన్నారు. తన మందు వల్ల ఎలాంటి దుష్ర్పభవాలు కలగవని ఆయన పేర్కొన్నారు. ‘ఒమిక్రాన్ వల్ల 50 రకాల బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సెకండ్ వేవ్ లో ఇచ్చిన మందు కంటే ఒమిక్రాన్ కట్టడి కోసం మరిన్ని అదనపు మూలికలు ఉపయోగిస్తున్నాం. నమ్మకం ఉన్న వారికే మేం మందు అందిస్తాం. నూటికి నూరు శాతం ఒమిక్రాన్ పై మా మందు పనిచేస్తుంది. ఆయుష్ నుంచి అనుమతులు వచ్చాక ఆన్లైన్ లో మందు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆనందయ్య పేర్కొన్నారు. కాగా గతంలో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందుపై అల్లోపతి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన అల్లోపతి వైద్యుల మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
Also Read:
Pushpa MASSive Success Party: అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ పార్టీ.. లైవ్ వీడియో
Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..