Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చలికాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.? క్యారెట్‌తో ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది.

Health: చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు వచ్చేస్తాయి. ముఖ్యంగా డ్రై స్కిన్‌తో బాధపడేవారికి ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖం పగిలి పోవడం..

Health: చలికాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా.? క్యారెట్‌తో ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 21, 2021 | 9:31 PM

Health: చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు వచ్చేస్తాయి. ముఖ్యంగా డ్రై స్కిన్‌తో బాధపడేవారికి ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖం పగిలి పోవడం, పేలవంగా మారుతుంటాయి. ఇందుకోసం చాలా మంది మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. అయితే సహజంగా క్యారెట్‌ సహాయంతో ముఖారవిందాన్ని సంరక్షించుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్‌ను కొన్ని పద్ధతుల్లో ఉపయోగిస్తే చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ చర్మాన్ని సంరక్షించుకోవడానికి క్యారెట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

* ముందుగా కొన్ని క్యారెట్‌ ముక్కలను తీసుకొని జ్యూస్‌ తయారు చేయాలి. అందులో పెరుగు, ఎగ్‌ వైట్‌ను సమానంలో కలిపి మిశ్రమంగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది.

* కాలంతో సంబంధం లేకుండా దుమ్ము, ధూళి, సూర్యకాంతి చర్మాన్ని దెబ్బ తీస్తుంటుంది. అలాంటి సమస్యకు చెక్‌పెట్టడానికి క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ను సమపాళ్లలో కలిపి ముఖంపై స్ప్రే చేసుకుంటే సన్‌ ప్రొటెక్టర్‌గా ఉపయోగపడుతుంది.

* క్యారెట్‌ను పేస్ట్‌లా తయార చేసుకొని అందులో ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం తేమగా మారి పగలకుండా ఉంటుంది.

* క్యారెట్ జ్యూస్ ఒక కప్పు తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసంలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఆయిల్‌ స్కిన్‌తో సతమతమయ్యే వారికి మంచి ఫలితం ఉంటుంది.

* క్యారెట్, అలోవెరా జ్యూస్‌లను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.

Also Read: IIT Bombay: ముంబై ఐఐటీలో కరోనా కలకలం.. ఏడుగురు విద్యార్థులకు పాజిటివ్..

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?