Year Ender 2021: ఈ ఏడాదిలో భారత మార్కెట్లో విడుదలైన టాప్‌ 9 కార్లు ఇవే.. ధర, ఫీచర్స్‌, ఇతర వివరాలు..!

Year Ender 2021: భారత్‌లో 2021 ఏడాదిలో ఎన్నో రకాల కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఏడాదిలో విడుదలైన టాప్‌ -9 కార్ల వివరాలు చూద్దాం. ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ (Aston Martin DBX)..

Subhash Goud

|

Updated on: Dec 22, 2021 | 6:53 AM

2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ (2021 Mercedes S-Class): జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో తన కొత్త 2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ లగ్జరీ కారు ధర రూ. 2.17 కోట్లు. 2021 మెర్సిడెస్ S-క్లాస్ రెండు వేరియంట్లలో తీసుకురాబడింది. అవి ఒకటి S 400d 4matic కాగా మరొకటి S 450 4matic. వీటి ధరలు వరుసగా రూ. 2.17 కోట్లు మరియు రూ. 2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

1 / 9
Year Ender 2021: భారత్‌లో 2021 ఏడాదిలో ఎన్నో రకాల కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఏడాదిలో విడుదలైన టాప్‌ -9 కార్ల వివరాలు చూద్దాం. ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ (Aston Martin DBX): ఈ లగ్జరీ కారు ఈ ఏడాదిలో భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్కచింది. లగ్జరీ కార్లలో ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ ఒకటి. ఈ లగ్జరీ కారు ధర రూ. 3.82 కోట్లు (ఎక్స్-షోరూమ్). కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఈ లగ్జరీ కారును తీసుకువచ్చింది. 4.0 లీటర్, ట్విన్ టర్బో, వి8 ఇంజిన్‌ కలిగివున్న ఈ అస్టన్‌ మార్టిన్‌ డిబిఎక్స్‌ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఇంజన్ 550 బిహెచ్‌పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకునే కెపాసిటీ ఉంది.

2 / 9
Audi Q5 Car: ఆడి ఎస్‌యూవీ క్యూ5 కారు: Audi Q5 Car: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈ ఏడాదిలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి మరో అడుగు ముందుకేసింది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎస్‌యూవీ క్యూ5 కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.63,77 లక్షలు, రూ.58.93 లక్షలు. ఈ సంవత్సరం ఆడి కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన వాహనాల్లో తొమ్మిదోది. ఇది 2.0 లీటర్ల టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌, ఎనిమిది ఎయిర్‌ బ్యాగులు, ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్నాయి.

3 / 9
జాగ్వార్ ఎఫ్ పేస్ SVR (Jaguar F-Pace SVR): ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ (Jaguar) తన జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ (Jaguar F-Pace SVR) ధర రూ. 1.51 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఇండియా). ఇది కూడా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ  ఎస్‌యూవీ కేవలం 0.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగం అందుకునే సామర్థ్యం ఉంది. గరిష్ట వేగం గంటకు 286 కి.మీ.

4 / 9
మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):  భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా కంపెనీ యొక్క ఎక్స్‌యువి700 ఇప్పటికే చాలా బుకింగ్స్‌ నమోదయ్యాయి. మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని రూ. 12.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

5 / 9
2021 మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్600 (2021 Mercedes Maybach GLS600): మెర్సిడెస్ బెంజ్ ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ. ఈ కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ధర దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్లు. ఈ కొత్త ఆధునిక SUV లో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

6 / 9
టాటా పంచ్‌ (Tata Punch): దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇటీవల కాలంలో టాటా పంచ్ అనే మైక్రో SUV ని విడుదల చేసింది. ఇది దేశీయ మారేట్లో అతి తక్కువ సమయంలో మంచి అమ్మకాలను పొందింది. విడుదలైన మొదటి నెలలోనే 8,453 యూనిట్లను విక్రయించగలిగింది.  దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. ఇది 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ ఇందులో ఉంది.

7 / 9
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun): ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 10.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ముందుభాగంలో ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

8 / 9
రెనాల్ట్ కైగర్ (Renault Kiger): రెనాల్ట్ కంపెనీ కైగర్‌ కారు మార్కెట్లో విడుదలైంది. ఈ కారు మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది. రెనాల్ట్ కైగర్ కంపెనీ యొక్క ఉత్తమ మోడల్ అయినప్పటికి క్రమంగా అమ్మకాలు తగ్గుదల వైపు వెళ్లాయి. రెనాల్ట్ కిగర్ దేశీయ మార్కెట్లో రూ. 5.64 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ SUV AMT మరియు CVT మరియు మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్) వస్తుంది. ఈ SUV ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

9 / 9
Follow us