- Telugu News Photo Gallery Business photos Year Ender 2021: Top Smart Phones Under Rs 25,000 from Xiaomi, OnePlus, Realme and More
Year Ender 2021: ఈ ఏడాదిలో రూ.25 వేల లోపు విడుదలైన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Year Ender 2021: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి ..
Updated on: Dec 21, 2021 | 1:35 PM

Year Ender 2021: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. షావోమీ, వన్‌ప్లస్, రియల్‌మీ, మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.25000లోపే ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లు 5జీ టెక్నాలజీతో వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఈ బడ్జెట్‌లో వచ్చిన స్మార్ట్ ఫోన్లు కొన్ని మీ కోసం..

ఐకూ జెడ్3 5జీ (iQoo Z3 5G): iQoo Z3 5G స్మార్ట్‌ఫోన్ రూ. 20,000 లోపు ఉంది. ఈ ఫోన్ సైజు 6.58 అంగుళాలతో హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఉంది. ఇంటిగ్రేటెడ్ Adreno 620 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768G SoC ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే వెనుకవైపు ఉన్న ట్రిపుల్ కెమెరా 64 మెగాపిక్సెల్, ప్రైమరీ కెమెరా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 19,999.

ఎంఐ 11 లైట్ (Mi 11 Lite): ఎంఐ 11 లైట్ 1080x2400 పిక్సెల్స్‌తో కూడిన 6.55 అంగుగళాల సైజులోడిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాను అందించారు. దీని ప్రారంభ ధర రూ. 22,499గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూషన్ (Motorola Edge 20 Fusion): ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సైజుతో ఉంది. హెచ్‌డీ డిస్‌ప్లే+ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. దీనికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఈ మొబైల్ 30W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 5,000mAh ఉంది. ఆండ్రాయిడ్ 11తో వచ్చింది. ఇందులో ప్రత్యేక చిప్‌సెట్ కలిగి ఉంది. ఇక భారతదేశంలో దీని ధర రూ. 21,499 నుండి ప్రారంభం అవుతుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ (OnePlus Nord CE 5G): వన్‌ప్లస్ వన్ నార్డ్ సిరీస్‌లో రూ. 25,000 అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేక ఫీచర్స్‌ను సైతం పొందు పర్చింది కంపెనీ. ఈ మొబైల్ 6.43 అంగుళాలతో హెచ్‌డీ డిస్‌ప్లేతో నార్డ్ లైనప్‌లో 'కోర్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ OnePlus Nord CE 5G కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్ పొందుపర్చింది. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ 64మెగాపిక్సెల్, ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని బ్యాటరీ 4,500mAh. భారతదేశంలో దీని ధర రూ 24,999 నుండి ప్రారంభమవుతుంది.

రియల్‌మీ ఎక్స్7 5జీ (Realme X7 5G): షావోమీ మాదిరిగానే Realme నుంచి కూడా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. ఆ ఫోన్‌లకు షియోమీ ఫోన్‌లలాగే రియల్ మీ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. దీని నుంచి అత్యాధునిక ఫీచర్స్ ఫోన్లు విడుదలయ్యాయి. X సిరీస్ లోRealme X7 5G విడుదల చేసింది. ఈ ఫోన్ సైజు 6.4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. బ్యాటరీ పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సదుపాయాలున్నాయి. మీడియాటెక్ మైమెన్సిటీ 800U పవర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్.. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. దీని ధర రూ 19,999 నుండి ప్రారంభం అవుతుంది.

షావోమీ ఎంఐ 10ఐ 5జీ (Xiaomi Mi 10i 5G): షావోమీ Xiaomi Mi 10i 5G స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 6.67 అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక భారతదేశంలోని మొట్టమొదటి బడ్జెట్ ఫోన్‌లలో ఇదొకటి. ఈ ఫోన్‌కు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. దీని బ్యాటరీ 4,820mAh ఉంది. ఒక్క యూనిట్ బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ వస్తుంది. దీని ధర రూ 21,999.





























