AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. ‘వాకౌ’లో 20 శాతం వాటా కొనుగోలు!

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదార్ పూనావాలా చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్.. జెట్‌సింథసిస్ అనుబంధ సంస్థ అయిన వాకౌ(Wakau) ఇంటరాక్టివ్‌లో 20% వాటాను కొనుగోలు చేశారు.

Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. 'వాకౌ'లో 20 శాతం వాటా కొనుగోలు!
Adar Poonawalla
KVD Varma
|

Updated on: Dec 22, 2021 | 7:38 AM

Share

Adar Poonawalla: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదార్ పూనావాలా చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్.. జెట్‌సింథసిస్ అనుబంధ సంస్థ అయిన వాకౌ(Wakau) ఇంటరాక్టివ్‌లో 20% వాటాను కొనుగోలు చేశారు.

వాకౌ అనేది కమ్యూనిటీ-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. ఇది మొబైల్-ఫస్ట్ స్క్రీన్ అనుభవం.. అనుబంధిత వీడియో-కామర్స్ ఎలిమెంట్‌తో వినోదం.. ఫ్యాషన్ డొమైన్‌లలో చిన్న వీడియో కంటెంట్ కలయికను అందిస్తుంది. వాకౌ ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం 4 లక్షలకు పైగా క్యూరేటెడ్ యూజర్స్ రూపొందించిన వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న వీడియోల కోసం 10,000 కంటే ఎక్కువ క్యూరేటెడ్ ప్రాంతీయ.. ప్రధాన మీడియా పాటల లైబ్రరీ దీనికి ఉంది. అంతేకాకుండా వాకౌ(Wakau) ప్రస్తుతం 5 లక్షల కంటే ఎక్కువ రోజువారీ యూజర్ ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లను కలిగి ఉంది. ఈ లావాదేవీలో పూనావాలా ఆర్ధిక వివరాలు వెల్లడి కాలేదు. ఇప్పటికే వాకౌలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాటాలను కలిగి ఉన్నారు.

షార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఫ్యాషన్ వీడియోల వంటి కొత్త కంటెంట్ ఫార్మాట్‌లు విస్తృత స్థాయిలో ప్రజాదరణను పొందుతున్నాయని పూనా వాలా అంటున్నారు. వాకౌ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో అధిక స్థాయి వ్యక్తిగతీకరణకు వినియోగదారులకు చాలా సులభమైన అవకాశాన్నిస్తుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇది చాలా సృజనాత్మకంగా, సరదాగా.. సురక్షితంగా ఉందని అన్నారు. వాకౌతో కలిసి ఈ అవకాశాల జగ్గర్‌నాట్‌లో చేరడానికి నేను సంతోషిస్తున్నాను అంటూ పూనావాలా చెప్పుకొచ్చారు.

జెట్‌సింథెసిస్ వైస్ చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ నవానీ మాట్లాడుతూ, వాకౌ ఒక లక్ష్యంతో రూపొందించమన్నారు. వినియోగదారులను అలరించడానికి.. సృజనాత్మకతను ప్రోత్సహించడానికి వాకౌ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:  Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?

వింతలకు నిలయంగా మారిన గ్రామం.. వారంతా 3 అడుగులకు మించి పెరగరు.. ఆ శాపమే కారణమంటోన్న గ్రామస్తులు..!