RBI Rules: డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లు అలర్ట్.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు
RBI Rules: కొత్త సంవత్సరం రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు మారుస్తుండటంతో ఆయా బ్యాంకులు తమతమ కస్టమర్లకు మెసేజ్‌లు చేరవేస్తున్నాయి...
RBI Rules: కొత్త సంవత్సరం రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు మారుస్తుండటంతో ఆయా బ్యాంకులు తమతమ కస్టమర్లకు మెసేజ్‌లు చేరవేస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2022 జనవరి 1 నుంచి లావాదేవీలు నిర్వహించాలంటే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు 16 అంకెలు ఎంటర్ చేయడం తప్పనిసరి. ఇది వరకు ఒకసారి కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే లావాదేవీలు జరిపే సమయంలో కేవలం పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అలాంటివేమి ఉండవు. కార్డుకు సంబంధించి 16 అంకెల నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే టోకెనైజేషన్ పద్ధతిని వాడాలి. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇకపై వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో బ్యాంకు వినియోగదారుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు సేవ్ చేసి ఉండవు. ఇప్పటికే స్టోర్ అయిన వివరాలన్నీ కూడా తొలగించాల్సి ఉంటుంది. కార్డు నెంబర్లకు బదులు టోకెన్ నెంబర్లు వస్తాయి. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మర్చంట్ వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను నిక్షప్తం చేయకూడదు. ఈ కొత్త నిబంధనలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
టొకనైజేషన్ అంటే ఏమిటి..? ఇప్పటి వరకు మనం లావాదేవీల సమయంలో కార్డుపై ఉండే 16 అంకెల నంబర్, కార్డు గడువు తేదీ, సీవీఈ, ఓటీపీని నమోదు చేయాలి. కానీ టోకెనైజేషన్ విధానంలో కార్డు కలిగిన వారు కార్డు వివరాలు తెలుపాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ కార్డు నంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ కోడ్ ఇస్తారు. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. అప్పుడు లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ప్రతి కార్డును ప్రత్యేకమైన టోకెన్ జారీ చేస్తారు. అయితే కార్డు భద్రతా నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకువచ్చింది. 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది ఆర్బీఐ. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి: