Credit Card: క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించకుంటే ఏమవుతుంది..? ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..!

Credit Card: ప్రస్తుతం చాలా బ్యాంకులు అన్ని వర్గాల వారికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి..

Credit Card: క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించకుంటే ఏమవుతుంది..? ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2021 | 9:43 AM

Credit Card: ప్రస్తుతం చాలా బ్యాంకులు అన్ని వర్గాల వారికి క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్‌ ద్వారానే కాంటాక్ట్‌ అయి కేవైసీ పత్రాలు తీసుకుని క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి బ్యాంకులు. అయితే క్రెడిట్‌ కార్డు తీసుకోవడమే కాకుండా వాడిన అమోంట్‌కు సరైన సమయంలో బిల్లు కడితే మేలు.. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

చెల్లింపు గడువు తేదీ: ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కార్డులోని డబ్బులను వాడుకుంటే కట్టే స్థోమత ఉన్నంత వరకు వాడుకోవడం మంచిది. బిల్లు జనరేట్‌ అయిన తర్వాత గడువు తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే లేట్‌ పేమెంట్‌ చార్జీలు అంటూ మోత మోగిపోతుంటుంది.

మొత్తం బాకీ చెల్లిస్తే.. కార్డులోని వాడిన అమోట్‌ను మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. పూర్తిగా చెల్లించకుండా సగ సగం చెల్లించినట్లయితే మీకు చార్జీలు తప్పవు. అంతేకాదు వడ్డీ, చక్రవడ్డీ అంటూ పెనాల్టీ చార్జీలు వేస్తుంటాయి బ్యాంకులు.

వడ్డీ లేకుండా.. మీకు బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన సమయంలో వినియోగదారులకు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని విధిస్తాయి. ఆ గడువు సమయంలో ఎలాంటి చార్జీలు లేకుండా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గడువు తీరిన తర్వాత చెల్లించినట్లయితే అప్పుల పాలు కావాల్సి ఉంటుంది. బిల్లు చెల్లించే గడువు దాటితే భారీగా వడ్డీ వసూలు చేస్తుంటాయి బ్యాంకులు.

నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. కార్డును వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో పెనాల్టీల మోత మోగుతుందని గుర్తించుకోవాలి. కార్డు వాడు ముందు ఆలోచించి వాడాలి. సమయానికి బిల్లు చెల్లించే స్థోమత ఉండి వాడితే ఎలాంటి సమస్య ఉండదు. క్రెడిట్‌ కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఎడపెడ వాడి గడవు లోగా చెల్లించకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Royal Enfield Classic 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో లోపాలు.. బైక్‌లను వెనక్కి తీసుకునేందుకు కంపెనీ నిర్ణయం!

SBI Credit Cards: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు.. వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద స్మార్ట్‌వాచ్‌..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే