Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. తగ్గిన వెండి ధరలు.. కిలో వెండి రేట్ ఎంతంటే..?

Silver Price Today: మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి.

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. తగ్గిన వెండి ధరలు.. కిలో వెండి రేట్ ఎంతంటే..?
Silver Price Today
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 7:22 AM

Silver Price Today: మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. ఒక వైపు బంగారం స్థిరంగా కొనసాగుతుంటే.. వెండి ధర ఈ రోజు తగ్గింది. తాజాగా మంగళవారం (డిసెంబర్‌ 21)న వెండి ధర దిగివచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ధరలు కొన్ని నగరాల్లో స్థిరంగా ఉంటే.. కొన్ని నగరాల్లో స్వల్పంగా దిగి వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,900 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,960 ఉండగా, కోల్‌కతాలో రూ.61,900 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,900 ఉండగా, కేరళలో రూ.65,960 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,960 ఉండగా, విజయవాడలో రూ.65,960 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Dalailama: మత సామరస్యం విషయంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి.. ఇక్కడి ప్రజల జీవనం నన్నెంతగానో ఆకట్టుకుంటోంది: దలైలామా