BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BEL

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..
Bel
Follow us
uppula Raju

|

Updated on: Dec 20, 2021 | 11:14 PM

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BEL తన మచిలీపట్నం యూనిట్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 ఖాళీలను భర్తీ చేస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- bel-india.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ డిసెంబర్ 24, 2021గా నిర్ణయించారు.

ఖాళీల వివరాలు 1. ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – I: 06 పోస్టులు 2. ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్) – I: 06 పోస్టులు 3. ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) – I: 03 పోస్టులు 4. అభ్యర్థులు దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 5. Gen/OBC/EWS అభ్యర్థులకు: 500/- 6. SC/ST/PWD అభ్యర్థులకు: ఫీజు లేదు

అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/కమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్‌లో పూర్తి సమయం BE/B.Tech/ B.Sc ఇంజనీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం.

ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్): అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్శిటీ నుంచి మెకానికల్‌లో పూర్తి సమయం BE/B.Tech/B.Sc ఇంజనీరింగ్ (4-సంవత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్): అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పూర్తి సమయం BE/B.Tech/ B.Sc ఇంజనీరింగ్ (4-సంవత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం.

ఎలా దరఖాస్తు చేయాలి అభ్యర్థులు స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా అన్ని సంబంధిత పత్రాలతో పాటుగా నిర్దేశించిన బయో-డేటాతో ది మేనేజర్ (హెచ్‌ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం – 521001, ఆంధ్రప్రదేశ్ పంపించాలి. డిసెంబర్ 24, 2021న లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Electric Cars: ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుపై పన్ను మినహాయింపు.. ఎంత ప్రయోజనం పొందవచ్చంటే..?

పెరిగిన చలితో ఇబ్బంది పడుతున్నారా..! రూమ్‌ హీటర్‌ పెట్టండి.. ధర కేవలం రూ.1000లోపే..?