పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

UP Cop Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్‌ అధికారి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. అతడి వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..
Up Police Video
Follow us
uppula Raju

|

Updated on: Dec 20, 2021 | 10:45 PM

UP Cop Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్‌ అధికారి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. అతడి వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అతడు ఏం మాట్లాడాడంటే.. పోలీసులు లంచం తీసుకుంటే కచ్చితంగా పనిచేస్తారని అన్నాడు. ఒక విధంగా పోలీసులు లంచం తీసుకుంటారని బహిరంగంగా ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అంతేకాదు అతడు మాట్లాడిన మాటలపై వివరణ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్‌ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఈ పోలీస్‌ అధికారి గెస్ట్‌గా వచ్చాడు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. “పోలీసులు డబ్బు తీసుకుంటే పని అయిపోతుంది” అని అన్నాడు. వీడియోలో అతను హిందీలో మాట్లాడటం మనం గమనించవచ్చు. అయితే అతడు ఈ మాట మాట్లాడగానే అక్కడున్న జనాలందరు నవ్వుతారు. ఇంకా అతడు ఇలా మాట్లాడాడు. ‘‘పోలీసుల కంటే మంచి డిపార్ట్‌మెంట్ లేదు.. పోలీసులు డబ్బులు తీసుకుంటే ఆ పని అయిపోతుంది.. వేరే డిపార్ట్‌మెంట్‌ వాళ్లు డబ్బులు తీసుకుంటారు.. కానీ పని జరగదు.. టీచర్లను చూడండి.. ఇంట్లో ఉంటూ నేర్పిస్తారు. మేము కరోనావైరస్ ఉన్నప్పటికీ అందరి కోసం పనిచేస్తున్నామని” మాట్లాడాడు.

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Putin call to Modi: ప్రధాని మోడీకి ఫోన్ కాల్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇంతకీ ఏం మాట్లాడారంటే?