AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అతిరథమహారధులు రంగం లోకి దిగారు. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి.

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!
Up Elections
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:13 PM

Share

UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అతిరథమహారధులు రంగం లోకి దిగారు. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. బీజేపీ జనవిశ్వాస్‌యాత్ర పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది . రాష్ట్రం లోని ఆరుప్రాంతాల నుంచి జనవిశ్వాసయాత్ర ప్రారంభమయ్యింది. పలువురు కేంద్రమంత్రులు , బీజేపీ అగ్రనేతలు ఈ యాత్రకు హాజరయ్యారు. మథురలో ఈ సందర్భంగా రోడ్‌షో నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యానాథ్‌. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా జన విశ్వాస్‌యాత్రకు హాజరయ్యారు . అంబేద్కర్‌నగర్‌ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. యోగి పాలనలో యూపీ అభివృద్దిలో దూసుకెళ్తోందన్నారు నడ్డా.

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగిపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీల నేతల ఫోన్‌ సంభాషణలను ట్యాప్‌ చేసి .. సాయంత్రం వేళ్లల్లో సీఎం యోగి వింటున్నారని విమర్శించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని , ఈడీ , సీబీఐ దాడులు చేసినప్పటికి భయపడేది లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, సన్నిహితుల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌ సంభాషణలను రికార్డు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సాయంత్రం ఈ సంభాషణలను వింటున్నారని అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో యూపీలో మరోసారి సరికొత్త రాజకీయ రచ్చకు తెరలేసింది.

అయితే అఖిలేశ్‌ ఆరోపణలను కొట్టి పారేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఐటీ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారం తమ పరిధిలో లేదన్నారు. ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేశామని, ఇప్పడు వాళ్ల ఆశీర్వాదం కోసమే జనవిశ్వాస్‌ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ప్రజా విశ్వాసంతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని ఆరుప్రాంతాల నుంచి జనవిశ్వాస్‌ యాత్ర ప్రారంభమయ్యింది. పవిత్ర మథుర నుంచి ఈ యాత్రలో నేను పాల్గొంటున్నా.. ప్రజల విశ్వాసం మావైపే ఉంది. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని యోగి ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ రాయ్‌బరేలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐటీ దాడులు , ఫోన్‌ ట్యాపింగ్‌లతో ప్రత్యర్ధులను బీజేపీ బెదిరిస్తోందని ప్రియాంక విమర్శించారు. హిందుత్వ పేరుతో ప్రధాని మోడీ ఆడుతున్న నాటకాలను రాహుల్‌ ప్రజల ముందు బహిర్గతం చేస్తున్నారని ప్రియాంక స్పష్టం చేశారు.

Read Also…. Putin call to Modi: ప్రధాని మోడీకి ఫోన్ కాల్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇంతకీ ఏం మాట్లాడారంటే?