PM Narendra Modi: న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌పై ప్రధాని మోదీ ఫోకస్.. నేడు యూపీలో పర్యటన..
PM Narendra Modi Prayagraj Visit: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మళ్లీ బీజేపీ
PM Narendra Modi Prayagraj Visit: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మళ్లీ బీజేపీ యోగి సర్కార్‌ను నిలబెట్టేందుకు ప్రధాని మోదీ.. సొంత రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను బదిలీ చేయనున్నారు. దీంపాటు 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు కూడా పీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 78 మంది మహిళలతో కూడా ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ కార్యక్రమానికి 2 లక్షల మందికి పైగా మహిళలు హాజరవుతారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నగదు బదిలీ వల్ల 16 లక్షల మంది మహిళలు ప్రత్యక్ష ప్రయోజనం పొందనున్నారు. అట్టడుగు స్థాయిలో మహిళలకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో సీఎం కన్యా సుమంగళ యోజన కింద లక్షా వెయ్యి మంది లబ్ధిదారులకు రూ.20.20 కోట్ల మొత్తాన్ని కూడా ప్రధాని మోదీ బదిలీ చేయనున్నారు. 80 వేల స్వయం సహాయక సంఘాలకు చెందిన ఒక్కో గ్రూపునకు రూ.1.10 లక్షల చొప్పున రూ. 880 కోట్ల సీఐఎఫ్‌ను కూడా ప్రధాని మోదీ ఇవ్వనున్నారు. దీంతో పాటు 60 వేల స్వయం సహాయక సంఘాలకు ఒక్కో గ్రూపునకు 15 వేల రూపాయల చొప్పున మొత్తం 120 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. ప్రధాని మోదీ దాదాపు రెండు గంటల పాటు ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు.
పర్యటన ఇలా.. ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బహ్మ్రౌలి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం వేదిక వద్దకు వెళ్తారు. ప్రధాని మోదీ కార్యక్రమం దాదాపు 2 గంటలపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా మహిళల ఖాతాకు నిధులు బదిలీ చేయడంతోపాటు ఎంపికైన మహిళలను సత్కరిస్తారు. దీంతో పాటు నేరుగా మహిళలతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు రాష్ట్రంలోని కీలక మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొననున్నారు.
Also Read: