Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E Shram Card : ఇ – శ్రమ్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా మీరే చేసుకోవచ్చు..!

E Shram Card : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడానికి, సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలను కల్పించడానికి భారత

E Shram Card : ఇ - శ్రమ్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా మీరే చేసుకోవచ్చు..!
E Shram Portal
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 21, 2021 | 8:03 AM

E Shram Card : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడానికి, సంఘటిత రంగంలోని కార్మికులతో సమానంగా ప్రయోజనాలను కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్డును తీసుకువచ్చింది. ఈ-శ్రమ్ కార్డు సహాయంతో అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వ పథకాలను సులభంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి, అసంఘటిత రంగ కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సింది ఉంటుంది. లేదంటే ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్ వినియోగం కూడా విరివిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ఫోన్‌లో మనమే ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఇ-శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇ-శ్రమ్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇ-శ్రమ్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే.. 1. e-shram కార్డ్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ముందుగా e-shram పోర్టల్ (eshram.gov.in) వెళ్లాలి. 2. ఆ తరువాత హోమ్ పేజీలో రిజిస్టర్ ఆన్ ఇ-ష్రామ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. రిజిస్టర్ ఆన్ ఇ-ష్రామ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే.. రిజిస్ట్రేషన్ ఫారమ్ కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది. 4. ఆ పేజీలో మీ ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, EPFO, ESIC వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 5. ఈ ప్రక్రియ తర్వాత, మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. 6. ఆ ఓటీపీ నెంబర్‌ను ఎంటర్ చేసి.. రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 7. ఇప్పుడు అప్లికేషన్ ఫారమ్‌లో మీ పేరు, చిరునామా, జీతం, వయస్సు, మీకు సంబంధించిన ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. 8. పూర్తి ఫారమ్ నింపిన తరువాత, అవసరమైన డాక్యూమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి. చివరగా వాటిని సబ్‌మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

ఏ పత్రాలు అవసరం.. రిజిస్ట్రేషన్ సమయంలో కార్మికులకు చాలా పత్రాలు అవసరమవుతుంది. ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ ఫోటో ఉండాలి.

Also read:

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Dalailama: మత సామరస్యం విషయంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి.. ఇక్కడి ప్రజల జీవనం నన్నెంతగానో ఆకట్టుకుంటోంది: దలైలామా

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!