Omicron: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా..? న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌ పడనుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

Omicron: కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల వల్ల కట్టడిలోకి వస్తుందని అనుకులోపే కొత్త వేరియంట్‌..

Omicron: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా..? న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌ పడనుందా..? నిపుణులు ఏమంటున్నారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2021 | 8:20 AM

Omicron: కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల వల్ల కట్టడిలోకి వస్తుందని అనుకులోపే కొత్త వేరియంట్‌ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తారా.? అనే ఆందోళన కలుగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలో ఒమిక్రాన్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రపంచంలో ఇప్పటికే 90 దేశాలకుపైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయవుతున్నాయి.

ఇప్పటి వరకు బ్రిటన్‌లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రాణాలకు ప్రమాదం లేదని కొన్ని అద్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ.. ఈ వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దని అని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కేసులు నమోదు అయ్యే అవయాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే చాలా మంది భావిస్తున్నారు.

న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రి వైద్యుడు లెఫ్టినెట్‌ జనరల్‌ వేద్‌ చతుర్వేది మాట్లాడుతూ.. వేరియంట్‌లు మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. ఇంతకు ముందు డెల్టా వేరియంట్‌ చాలా ప్రమాదకరమైనదిగా వచ్చింది. ఈ వేరియంట్‌ కారణంగా ఊపిరితిత్తులు చాలా దెబ్బతీశాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ దగ్గు, జలుబు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్‌ను జన్యు పరీక్షల ద్వారా గుర్తించవచ్చు అని అన్నారు.

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారా..? డాక్టర్‌ చతుర్వేది ఆల్‌ఇండియా న్యూస్‌తో మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యూరప్‌లో నమోదవుతున్న కేసులను చూస్తే ఆస్పత్రి పాలైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. ముందు నుంచే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటే లాక్‌డౌన్‌ వరకు వెళ్లే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యం వహించినట్లయితే కేసులు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది.

థర్డ్‌వేవ్‌ గురించి మాట్లాడుతూ.. వైరస్‌ పాతది అయినా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో చాలా కేసులు వస్తున్నాయి. ఇది భారతదేశంలో కూడా పెరిగే అవకాశం ఉంది. థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెబుతోంది అని అన్నారు. పరిశోధకుల అధ్యయనాల ప్రకారం.. జనవరి లేదా ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఇది ఎంత వరకు ఖచ్చితమనేది చెప్పలేము. మనం కరోనా జాగ్రత్తలు పాటించేదాని బట్టి ఉంటుందని డాక్టర్‌ చతుర్వేది అన్నారు.

కొత్త సంవత్సరంలో ఆంక్షలు ఉంటాయా..? దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం.. కొత్త సంవత్సరం వేడుకలు వస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త సంవత్సరం వస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీంతో దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకలు వస్తుండటంతో ఒమిక్రాన్‌ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డిసెంబర్‌ 31, జనవరి 1న రెండు రోజులు దేశంలో ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

Delmicron: కరోనా కొత్త వేరియంట్‌ డెల్మిక్రాన్‌.. వేగంగా విస్తరిస్తోంది.. 3 స్థానంలో తెలంగాణ

Omicron in UK: కొత్త వేరియంట్‌తో వణికిపోతున్న బ్రిటన్‌.. ఒక్క‌రోజులోనే మూడు రెట్లు పెరిగిన ఒమిక్రాన్ కేసులు!

నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..