Children: దగ్గు ముందుతోనే ఆ చిన్నారులు చనిపోయారు.. నివేదికలో కీలక విషయాలు వెల్లడి

Cough Syrup Death: ఏమైందో ఏమో.. ఢిల్లీలోని కళావతి శరణ్ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో 13మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణాలు ఏంటనే కోణంలో

Children: దగ్గు ముందుతోనే ఆ చిన్నారులు చనిపోయారు.. నివేదికలో కీలక విషయాలు వెల్లడి
Cough Syrup Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 21, 2021 | 7:27 AM

Cough Syrup Death: ఏమైందో ఏమో.. ఢిల్లీలోని కళావతి శరణ్ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో 13మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణాలు ఏంటనే కోణంలో విచారణ చేపట్టారు అధికారులు. వారికి సంచలన విషయం తెలిసింది. ఈ పిల్లల చావుకు నాణ్యతలేని దగ్గుమందే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. డెక్స్‌ట్రో మెథార్ఫాన్ కాఫ్ సిరప్ కారణంగానే ఈ పిల్లలు చనిపోయినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ స్పష్టం చేసింది. పిల్లల మరణంపై చేపట్టిన దర్యాప్తు నివేదికను వెల్లడించారు అధికారులు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్‌ ఆస్పత్రిలో కొందరు పిల్లలు అనారోగ్యంతో చేరారు. వీరికి ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన డెక్స్‌ట్రో మెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు వైద్యులు. ఈ మందు వికటించడంతో, ముగ్గురు పిల్లలు ప్రాణాలు వదిలారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నాలుగు నెలల క్రితం చిన్నారులు మరణించిన ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచారణ చేపట్టింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో పాటు పలు డిస్పెన్సరీల్లో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తోన్న, డెక్స్‌ట్రో మెథార్ఫాన్ కాఫ్ సిరప్ ఈ చిన్నారుల చావుకు కారణమని తేల్చింది డీజీహెచ్ఎస్. ఇదొక నాసిరకం దగ్గుమందని, అందుకే ఇకపై దీనిని నాలుగేళ్లలోపు చిన్నారులకు ఇవ్వద్దని స్పష్టం చేశారు అధికారులు. మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీల్లో పంపిణీ చేస్తోన్న ఈ మందును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

ముగ్గురు వైద్యల తొలగింపు.. కాగా.. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముగ్గురు పిల్లల మృతికి సంబంధించి మొహల్లా క్లినిక్‌లోని ముగ్గురు వైద్యులను సోమవారం తొలగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటనపై అప్పుడే విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ కూడా రాసిందన్నారు. సీడీఎమ్ఓ డాక్టర్ గీత ఆధ్వర్యంలో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు సత్యేందర్ జైన్ వెల్లడించారు.

Also Read:

Viral Video: మద్యం భలే గమ్మత్తైంది.. అరటి చెట్టుతో ఫైట్ అదిరిపోయింది..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?