Omicron Test Kit: ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు సరికొత్త కిట్.. తయారు చేసిన ఐసీఎంఆర్
Omicron Test Kit: ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ దేశాలను వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ భారత్‌లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది...
Omicron Test Kit: ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ దేశాలను వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ భారత్‌లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మెల్లమెల్లగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు సరికొత్త కిట్‌ను తయారు చేసింది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్). దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. ఐవీడీ కిట్ తయారీదారులకు ఈ ఎన్‌విట్రో కిట్లకు (ఐవీడి) కావాల్సిన సాంకేతికతను సంస్థ బదిలీ చేసింది. దీనిపై పేటెంట్ హక్కులు, కమర్షియల్ హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్న వారికి కిట్‌ను తయారు చేసి విక్రయించుకునే అధికారాన్ని ఇస్తామని తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు దేశంలో ఎలాంటి కిట్లు లేవు. ఈ వేరియంట్ అనుమానిత వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతోంది. ఇప్పుడు ఐసీఎంఆర్ కిట్‌ను తయారు చేయడంతో ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు జినోమ్ స్వీకెన్సింగ్ విధానాన్ని వాడుతున్నారు. ఇది ఎంతో ఖరీదైనది కూడా.
ఇవి కూడా చదవండి: