Omicron in UK: కొత్త వేరియంట్‌తో వణికిపోతున్న బ్రిటన్.. ఒక్కరోజులోనే మూడు రెట్లు పెరిగిన ఒమిక్రాన్ కేసులు!
ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
Omicron Variant in UK: ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే దక్షిణాప్రికాలో తన ప్రతాపాన్ని చూపి.. కరోనా ఫోర్త్ వేవ్ కారణమైన ఒమిక్రాన్.. ప్రస్తుతం అమెరికా సహా బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల్లో పంజా విసురుతోంది. ముఖ్యంగా బ్రిటన్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్రిటన్ లాక్ డౌన్ లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కేవలం ఒక్కరోజులోనే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు పెరగడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బ్రిటన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… బ్రిటనల్ లో మొత్తం 90,418 కరనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌లు నమోదయ్యాయి. అలాగే, UKలో COVID 19 రోజువారీ మరణాల సంఖ్య 125కి చేరుకుంది. కొత్త కరోనా వైరస్ కేసులు 90 వేలకు పైగా ఉండగా, అందులో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే అక్కడ ఒమిక్రాన్ కేసుల నమోదులో మూడు రెట్లు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ 13న యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఏడుగురు మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతే, సోమవారం ఈ సంఖ్య 12కు చేరుకుంది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఆదేశంలో ఇప్పటివరకు 104 మంది మరణించినట్లు పేర్కొన్నారు.
బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మారణాలు సైతం పెరుగుతున్నాయి. మొట్టమొదటి ఒమిక్రాన్ మరణాన్ని నివేదించిన బ్రిటన్‌లో ఈ వేరియంట్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 7కు పెరిగింది. Omicron వేరియంట్ ను ఎదుర్కొవడానికి ప్రభుత్వంతో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని UK ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు. కరనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొంటున్నారు. కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత లాక్డౌన్‌ను విధించనున్నట్టు సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లండన్ లోనూ కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం దాదాపు 30 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ చివరి నాటికి పెద్దలందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని బ్రిటన్ సర్కారు కొత్త జాతీయ మిషన్ ను ప్రారంభించింది. సోమవారం నుంచి దీనిని అమల్లోకి తీసుకువస్తున్నారు. తాజా NHS గణాంకాల ప్రకారం, ఇంగ్లండ్‌లో 40 ఏళ్లు పైబడిన వారిలో మూడొంతుల మంది అర్హులైన వ్యక్తులు ఇప్పుడు వారి బూస్టర్ షాట్‌లను అందుకున్నారు. ఆ సంఖ్య 50 ఏళ్లు పైబడిన వారిలో 10 మందిలో ఎనిమిది మంది కంటే ఎక్కువగా ఉంది.
ఇక, మిగతా వారికి సైతం బూస్టర్ డోసులు అందించడం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఇదిలావుండగా, వ్యాక్సిన్ తీసుకోవడాన్ని నిరాకరిస్తూ.. బ్రిటన్ లోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగడం గమనార్హం. టీకాలు తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని నిరశిస్తూ.. లండన్ రోడ్లపై ప్రజలు ఆందోళనకు దిగారు. దాదాపు 5 వేల మందికి పైగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వీరిని చెదగొట్టే సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.
Read Also… Four Day Week: వారానికి నాలుగు రోజుల పని విధానంపై కేంద్రం కసరత్తులు.. త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం!