Viral Video: మద్యం భలే గమ్మత్తైంది.. అరటి చెట్టుతో ఫైట్ అదిరిపోయింది..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video: మాదకద్రవ్యాల వ్యసనం ఒక చెడ్డ అలవాటు. దీనివల్ల అన్ని కోల్పోతారు. మితిమీరిన మత్తు కారణంగా ఒక్కోసారి ఏం చేస్తున్నారో
Viral Video: మాదకద్రవ్యాల వ్యసనం ఒక చెడ్డ అలవాటు. దీనివల్ల అన్ని కోల్పోతారు. మితిమీరిన మత్తు కారణంగా ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు. తాజాగా సోషల్ మీడియాలో ఓ సరదా వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక తాగిన వ్యక్తి కాలువను దాటడానికి ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా అరటి చెట్టు అడ్డం వస్తుంది. తర్వాత అతడు చేసిన పని చూస్తే అందరికి నవ్వొస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి మద్యం తాగి బాక్సింగ్ చేయడం మనం వీడియోలో గమనించవచ్చు. అరటి చెట్టుని పంచ్‌తో కొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అతడికి బ్యాలెన్స్ ఆగదు. అలా అరటిచెట్టుకి పంచ్‌లు ఇస్తూ కిందపడిపోతాడు. అయినప్పటికీ మళ్లీ చెట్టుని కొట్టడానికి వచ్చేందుకు ట్రై చేస్తాడు. ఈ వ్యక్తి చేసిన ఈ గమ్మత్తైన పనికి వీడియో చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీడియో గురించి మాట్లాడుతూ.. ‘కొన్ని పెగ్‌ల తర్వాత అతడిలో నుంచి బ్రూస్ లీ బయటికి వచ్చాడు’ అని రాశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రజలు దీనిని చూసి తెగ నవ్వుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు కమాన్ బ్రూస్‌లీ అంటు వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. మరొక వినియోగదారు మత్తులో ఉన్నప్పుడు పోరాట యోధుడు బయటకు వస్తాడని రాశాడు. ఇంకొకరు ‘కొన్ని పెగ్‌ల తర్వాత, బ్రూస్ లీ బయటికి వచ్చాడని వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో అందరిని నవ్వించడం విశేషం.
#BruceLee after a few pegs…..☺️☺️☺️?? pic.twitter.com/KaZD0U7tKc
— Rupin Sharma IPS (@rupin1992) December 20, 2021