Red Port: మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే అంటూ మహిళ కోర్టులో పిటిషన్.. 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు
Red Port: ఇప్పటి వరకు చార్మినార్ , గోల్కొండ, వంటి పబ్లిక్ ప్లేసెస్ లను అమ్మేస్తాం.. అవి నావే అంటూ మనం సినిమాల్లో సరదాగా సన్నివేశాల్లో అనేక సార్లు చూసాం.. అయితే ఇప్పుడు అటువంటి పిటిషన్..
Red Port: ఇప్పటి వరకు చార్మినార్ , గోల్కొండ, వంటి పబ్లిక్ ప్లేసెస్ లను అమ్మేస్తాం.. అవి నావే అంటూ మనం సినిమాల్లో సరదాగా సన్నివేశాల్లో అనేక సార్లు చూసాం.. అయితే ఇప్పుడు అటువంటి పిటిషన్ ఒకటి కోర్టులో దాఖలు అయింది. దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత మొఘల్ వారసులం అంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్ హౌరాలోని మురికివాడలో నివసించే సుల్తానా.. తాను మొఘల్ చక్రవర్తి మునిమనవడు మీర్జా మహమ్మద్ బీదర్ భక్త్ భార్యని అని తెలిపింది. “రంగూన్ నుండి తప్పించుకుని తాము భారత లో వచ్చి ఉంటున్నామని చెప్పింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన 68 ఏళ్ల సుల్తానా బేగం తాను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్య అని చెబుతుంది. ఈ పిటిషన్ లో తాను మొఘలుల వారసురాలిని కనుక ఎర్ర కోటను తనకు అప్పగించాలని.. లేకపోతే.. అందుకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతుంది సుల్తానా.
సుల్తానా .. ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫ్రీ కు నిజమైన వారసురాలిని అని.. బహదూర్ షా ని 1857లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలు పదవి నుంచి తొలగించాయని.. అప్పుడు ఆయనకు చెందిన ఆస్తులను అక్రమంగా ఈస్టిండియా కంపెనీ లాగేసుకుందని చెబుతుంది. అంతేకాదు బహదూర్ షా జాఫర్ 2 వారసుడిగా బీదర్ భక్త్ ను 1960లో ప్రకటించిందని సుల్తానా వివరించింది. ఆ బీదర్ భక్త్ తన భర్త.. ఆయన 1980లో మే 22న మరణించారని తెలిపింది. అప్పటి నుంచి భారత ప్రభుత్వం అంటే 1980 ఆగస్టు 15 నుంచి పెన్షన్ ఇస్తుందని సుల్తానా బేగం కోర్టుకు వివరించింది. అయితే ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తనకు సరిపోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది.
ఎర్రకోట తమ పూర్వాకుల ఆస్థి అని.. తానే వారసురాలు కనుక ఎర్రకోటని తనకు అప్పగించాలని కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఎర్రకోటను తమ అధీనంలో ఉంచుకుందని తెలిపింది. ఇప్పటికైనా తనకు తమ వారసత్వ సంపదగా ఎర్రకోటను తనకు అప్పగించాలని .. 1857 నుంచి నష్టపరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీ కోర్టుని సుల్తానా డిమాండ్ చేస్తోంది.
అయితే సుల్తానా వేసిన పిటిషన్ పై జస్టిస్ రేఖాధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించింది. 1857లో అన్యాయం జరిగితే.. 170 ఏళ్ల తర్వాత మీరు కోర్టును ఆశ్రయించారు.. దయచేసి మీరు ఇన్ని రోజులు ఏమి చేశారు అంటూ ప్రశ్నించింది. సుల్తానా తరపు న్యాయవాది తన క్లయింట్ నిరక్ష్యరాసులని.. అందుకే కోర్టుని ఆశ్రయించలేదని వివరించారు. అది అసలు ఆమోదయోగ్యం కాదంటూ ధర్మాసనం సుల్తానా పిటిషన్ ను కొట్టివేసింది.
Also Read: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్స్ ‘సితార’ పిక్ వైరల్ ..