AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putin call to Modi: ప్రధాని మోడీకి ఫోన్ కాల్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇంతకీ ఏం మాట్లాడారంటే?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోనిక్ సంభాషణ నిర్వహించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులతో సహా అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.

Putin call to Modi: ప్రధాని మోడీకి ఫోన్ కాల్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇంతకీ  ఏం మాట్లాడారంటే?
Vladimir Putin Meet Modi
Balaraju Goud
|

Updated on: Dec 20, 2021 | 9:34 PM

Share

Putin telephonic conversation with PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోనిక్ సంభాషణ నిర్వహించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులతో సహా అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించారు. ఈనెల 6న ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా ఇరు నేతలు చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇటీవల భారత్ కు వచ్చిన రష్యా ప్రతినిధి బృందానికి ఢిల్లీలో అందించిన ఆతిథ్యానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం. అలాగే ప్రధాని మోడీతో 21వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ డిసెంబర్ 6న న్యూఢిల్లీకి వర్కింగ్ విజిట్ చేశారు. హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ. భారత్‌ బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని కొనియాడారు. ఉభయ దేశాల మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రష్యా భారత్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో సంబంధాలను మరింత బహుముఖంగా అభివృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.

భారత్ పర్యటనలో పుతిన్ బృందాలను కుదుర్చుకుంది. ఉభయ దేశాలు నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉత్తరప్రదేశ్‌ అమేథీలోని ఇండో రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో 6,01,427 ఏకే 203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. అలాగే, సీమాంతర ఉగ్రవాదంపై పోరాడాలని, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారంపైనా చర్చించారు. రెండు దేశాల మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం.

Read Also… E-Shram Card: అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ వరం.. ఈ శ్రమ్ కార్డు.. దీనితో ప్రయోజనం ఏమిటంటే..