PM Kisan: ఈ రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. కారణం ఏంటో తెలుసా?

గత సంవత్సరం ఈ పథకం 12వ వాయిదా అక్టోబర్ 2022లో జమ చేయగా, 13వ వాయిదా ఫిబ్రవరి 2023లో జమ చేయబడింది. జూలై 27న రైతుల ఖాతాల్లో 14 వాయిదాలు జమయ్యాయి. ఇప్పుడు నవంబర్ నెలలో కేంద్రం 15వ వాయిదాను జమ చేసింది. అంటే ఒక్కో విడత మధ్య దాదాపు ఐదు నెలల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు 16వ విడత కోసం వేచి చూస్తున్నారు రైతులు. ఈ పథకం కింద

PM Kisan: ఈ రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు రావు.. కారణం ఏంటో తెలుసా?
Pm Kisan
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2024 | 9:33 AM

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు అందుతున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్ర మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రైతులు ఈ సహాయ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తారు? దాన్ని ఎలా ఉపయోగించారనేది వెల్లడవుతుంది. ఇంతలో ఈ పథకం ప్రయోజనం చాలా మంది రైతులకు ఆగిపోయింది. కొన్ని కారణాల వల్ల ఈ పథకం ప్రయోజనం నిలిపివేసింది కేంద్రం. అటువంటి రైతుల సమస్యలను తెలుసుకుని, సమస్య పరిష్కారానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి ఈ ప్రత్యేక ప్రచారాన్ని అమలు చేస్తోంది.

15 వాయిదాలు వచ్చాయి

గత సంవత్సరం ఈ పథకం 12వ వాయిదా అక్టోబర్ 2022లో జమ చేయగా, 13వ వాయిదా ఫిబ్రవరి 2023లో జమ చేయబడింది. జూలై 27న రైతుల ఖాతాల్లో 14 వాయిదాలు జమయ్యాయి. ఇప్పుడు నవంబర్ నెలలో కేంద్రం 15వ వాయిదాను జమ చేసింది. అంటే ఒక్కో విడత మధ్య దాదాపు ఐదు నెలల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు 16వ విడత కోసం వేచి చూస్తున్నారు రైతులు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున మొత్తం 6 వేల రూపాయలు రైతులకు జమ చేశారు. డీబీటీ ద్వారా ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.

ఇవి కూడా చదవండి

వీరికి 16వ విడత రాదు

పీఎం కిసాన్‌ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 16వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతోంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వస్తోంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తోంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 మధ్య పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఇందులో పాలుపంచుకుంటుంది. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా సాధారణ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్రం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి