AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు

మోదీ దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. వ్యవసాయ రంగానికి కొత్త సాంకేతికతను, మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ రంగం ఎక్కువగా పాల్గొంటోంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు

PM Modi: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు
Modi Schems
Subhash Goud
|

Updated on: Feb 14, 2024 | 8:29 AM

Share

ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మోదీ దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. వ్యవసాయ రంగానికి కొత్త సాంకేతికతను, మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ రంగం ఎక్కువగా పాల్గొంటోంది.

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని పథకాలను చేపట్టింది. అటువంటి ప్రాజెక్ట్‌ల గురించిన తెలుసుకుందాం.

ఇవీ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకాలు:

ఇవి కూడా చదవండి
  • ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన: భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రూ.2000 చొప్పున అందిస్తోంది.
  • పంటల బీమా పథకం: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా పంట నష్టపోయిన సమయంలో బీమా అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించింది కేంద్రం.
  • పీఎం కిసాన్ నీటి పారుదల స్కీమ్: సాగు నీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజనను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రతి పొలానికి నీరు అందిచాలి. దీని కింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు, బోర్డు, ఫీల్డ్ అప్లికేషన్, డెవలప్‌మెంట్ పద్ధతులపై ఎండ్ టు ఎండ్ మేనేజ్‌మెంట్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • క్రెడిట్ కార్డ్: కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు రుణ సౌకర్యం అందిస్తోంది. ఈ రుణాన్ని రైతులు పంటల కోసం ఉపయోగించుకోవచ్చు.
  • ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్: దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్‌పిఓల ద్వారా రైతులను ఆర్థికంగా, మార్కెట్‌లో ఈ పథకం ద్వారా బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందులో రైతులు పలు ప్రయోజనాలు పొందవచ్చు.
  • డ్రోన్ల వినియోగం: వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగంలో పెద్ద మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు.
  • తేనెటీగల పెంపకం పథకం: రాష్ట్రీయ గోకుల్ పథకం, నీలి విప్లవం, వడ్డీ రాయితీ పథకం, ఆగ్రోఫారెస్ట్రీ, వెదురు అటవీ నిర్మూలన పథకం, వాటర్‌షెడ్ అభివృద్ధి పథకం మొదలైనవి ఉన్నాయి.
  • పీఎం కిసాన్‌ మాన్‌ ధన్‌: ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఇది పెన్షన్ పథకం అని చెప్పుకోవచ్చు. రైతులు ఇందులో చేరొచ్చు. 2019లో ఈ పథకం అమలులోకి వచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. గరిష్టంగా రూ. 3 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది.
  • వడ్డీ రాయితీ స్కీమ్‌: కేంద్రం ఈ పథకాన్ని 2022 ఆగస్ట్ నెలలో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటులో 1.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే కచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అంటే వడ్డీ కట్టి, మళ్లీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి