- Telugu News Photo Gallery Business photos Tata Nexon Ev And Tata Tiago Ev Price Cut By Tata Motors Check New Price
Tata Electric Cars: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టాటా ఈవీ కార్లు
ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక టాటా మోటార్స్ నుంచి ఈవీ కార్లు బాగానే మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా టాటా మోటార్స్ వాహనదారులకు శుభవార్త అందించింది. పలు మోడళ్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది..
Updated on: Feb 14, 2024 | 11:50 AM

ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక టాటా మోటార్స్ నుంచి ఈవీ కార్లు బాగానే మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా టాటా మోటార్స్ వాహనదారులకు శుభవార్త అందించింది. పలు మోడళ్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఎంజీ మోటార్స్ కూడా ఈవీ వాహనాల ధరలను తగ్గించగా, ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తగ్గిస్తోంది.

టాటా మోటర్స్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్, టాటా టియాగో ఈవీ ధరలను రూ.1.20 లక్షలు తగ్గించింది. అంటే ఇప్పుడు ఈ రెండు టాటా ఎలక్ట్రిక్ కార్లను చౌక ధరలకు కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం.

Tata Nexon EV ఇప్పుడు మీకు రూ. 1.20 లక్షల చౌకగా లభిస్తుంది. ధర తగ్గింపు తర్వాత ఈ కారు ధర ఇప్పుడు రూ. 14.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

టియాగో ఎలక్ట్రిక్ మోడల్ కూడా రూ.70 వేల వరకు తగ్గింది. ధర తగ్గింపు తర్వాత టాటా టియాగో EV ధర ఇప్పుడు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

టాటా మోటార్స్ నెక్సాన్ లాంగ్-రేంజ్ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 465 కి.మీల దూరం వరకు ప్రయాణించగలదు. ఇక టియాగో పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీల దూరం ప్రయాణించగలదు.




