PM Surya Ghar: Muft Bijli Yojana: కాలుష్యాన్ని తగ్గించడానికి, సహజ వనరుల క్షీణతను నివారించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టిసారించింది. దీని కింద.. ఇప్పటికే సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లను అమర్చనున్నారు. దీనిద్వారా వారు సౌర విద్యుత్తును వినియోగించుకోవడంతోపాటు.. కరెంటు బిల్లులు భారం కూడా తగ్గుతుంది. అయితే, సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం.. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ స్కీమ్‌తో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే, సోలార్ రూఫ్‌టాప్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఏ విధంగా దానిని పూర్తిచేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.