AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Cars In India: రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో ఇండియాలో టాప్ బెస్ట్ కార్లు ఇవే.. ఎక్కువ మైలేజ్.. లగ్జరీ లుక్. .

రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకుంటున్నారా..? అలాంటివారి కోసం ఇండియాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి. మంచి లగ్జరీ లుక్‌ను కూడా ఇవి అందిస్తున్నాయి. అనేక ప్రీమియం ఫీచర్లు కూడా ఈ కార్లలో ఉన్నాయి. ఆ కార్ల వివరాలు ఇవే..

Top Cars In India:  రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో ఇండియాలో టాప్ బెస్ట్ కార్లు ఇవే.. ఎక్కువ మైలేజ్.. లగ్జరీ లుక్. .
Tata Nexon Car
Venkatrao Lella
|

Updated on: Nov 24, 2025 | 5:01 PM

Share

Best Budget Cars: కారు కొనాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు కారు తీసుకోవాలంటే అతి కష్టంతో కూడుకున్న పని. కారు కోసం వెహికల్ లోన్లు అన్నీ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు కార్ లోన్ తీసుకుని ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అలాంటివారి కోసం మార్కెట్లో రూ.10లక్షల లోపు వచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌తో సంబంధం లేకుండా అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ SUV కార్లు ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

టాటా నెక్సాన్ CNG

టాటా నెక్సాన్ భారత్‌లో తొలి , ఏకైక టర్బో-పెట్రోల్ సీఎన్‌జీ ఎస్‌యూవీ కారు. ఇది CNG 17.44 కిమీ/కిలో ఇంధన సామర్థ్యంతో ఉంది. అంతేకాకుండా ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ CNG మోడ్‌లో కూడా శక్తివంతమైన 100 PS, 170Nmను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.10 లక్షల కంటే తక్కువ  ఉండగా.. అనేక వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌లో కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచిగా ఎంపిక

మారుతి ఎస్-ప్రెస్సో CNG

ఇది భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. 1.0-లీటర్ ఇంజిన్ CNGపై 57పిఎస్, 82.1 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇరుకైన వీధుల్లో కూడా  ఈ కారుతో సులువుగా వెళ్లవచ్చు. తక్కువ నిర్వహణతో పాటు అధిక మైలేజ్ కూడా ఇస్తుంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4 లక్షలుగా ఉంది.

మారుతి వాగన్ ఆర్ CNG

ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ వేరియెంట్లలో లభిస్తుంది. 1.0-లీటర్ ఇంజిన్, ఎస్-సిఎన్‌జి కిట్‌తో ఇది వస్తుంది. కిలోకు 34.05 కిమీ వరకు సర్టిఫైడ్ మైలేజీని ఈ కారు అందిస్తుంది. ABS, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన 5-సీట్ల మాన్యువల్ కారు ఇది. విశాలమైన క్యాబిన్, మంచి హెడ్‌రూమ్, 341-లీటర్ బూట్ స్పేస్ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కుటుంబ రీత్యా కారు వాడాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.42 లక్షలుగా ఉంది.

టాటా టియాగో CNG

CNG విభాగంలో AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన మొదటి కార్లలో ఇది ఒకటి. 1.2-లీటర్ ఇంజిన్ CNG మోడ్‌లో 73PS, 95 Nm ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షలు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ CNG

ఈ కారు 1.2-లీటర్ ఇంజిన్‌తో పనిచేయడంతో పాటు CNG మోడ్‌లో 69 PS, 95.2 Nm ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, శుద్ధి చేసిన క్యాబిన్, సైలెంట్ డ్రైవింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం 7.17 లక్షలగా ఉంది.

మారుతి బాలెనో CNG

ఈ కారు 1.2-లీటర్ ఇంజిన్ CNG మోడ్‌లో 78 PS, 98 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. విశాలమైన క్యాబిన్, స్మూత్ డ్రైవ్, అధిక ఇంధన సామర్థ్యంతో ఈ కారు తక్కువ ధరలో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది దీని ఎక్స్-షోరూమ్ ధర .7 లక్షలుగా ఉంది.

Follow Us