AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Plan: మీకు రూ.30 వేల శాలరీ వస్తుందా..? ఈ పనులు చేస్తే మీ డబ్బులు డబుల్..

డబ్బులు పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవడం, ఆచితూచి వ్యవహరించడం వల్ల పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇండియాలో తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించేవారే తక్కువమంది. ఇలాంటప్పుడు డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలి..? అనేది ఇందులో చూద్దాం.

Investment Plan: మీకు రూ.30 వేల శాలరీ వస్తుందా..? ఈ పనులు చేస్తే మీ డబ్బులు డబుల్..
Salary Invetment
Venkatrao Lella
|

Updated on: Nov 24, 2025 | 4:16 PM

Share

నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జీతం ఏ నెలకు ఈ నెల ఖర్చుయిపోతుంది. భార్య, పిల్లలు ఉంటే ఇక తలకు మించిన భారమే. ఖర్చులకు జీతం సరిపోక అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం డబ్బులు ఆదా చేయడం అనేది కష్టమే. భారత్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువమంది. రూ.20 వేలు, రూ.30 వేలలోపు జీతంతో బ్రతుకుబండిని నడిపేవారే ఎక్కువమంది. అన్నీ ధరలు పెరిగిన క్రమంలో వచ్చే జీతం ఇంటి ఖర్చులు, ఈఎంఐలకు పోగా.. మిగిలేది చాలా తక్కువ. ఒకవేళ ఎంతోకోంత మిగిలినా.. అంత తక్కువ సొమ్మును ఎలా సేవ్ చేయాలనే అవగాహన చాలామంది ఉండదు. ఒకవేళ రూ.30 వేలలోపు శాలరీ పొందేవారు డబ్బులు పొదుపు చేయాలనుకుంటే చక్కటి సేవింగ్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం.

ఇలా పొదుపు చేసుకోండి..

-మీకు రూ.30 జీతం వస్తుంటే.. అందులో నుంచి మీరు 15 శాతం ఎందులోనైనా పెట్టుబడి పెట్టండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)ప్లాన్ కింద నెలనెలా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.6 వేలు పెట్టుబడి పెట్టండి.

-ఇక కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)లో రూ.4 వేల చొప్పున నెల నెలా పొదుపు చేసుకోండి.

-ఇక ఏదైనా పోస్టాఫీస్ స్కీమ్‌లో నెలకు రూ.2 వేల చొప్పున పొదుపు చేయండి

-మీ ఫ్యామిలీ భద్రత కోసం రూ.వెయ్యి టర్న్ ఇన్స్యూరెన్స్ కోసం ఖర్చు చేయండి

-ఇక మీ ఫ్యామిలీ ఆరోగ్య భద్రత కోసం రూ.వెయ్యి ప్రతీనెలా హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం ఖర్చు పెట్టండి

నిత్యావసరాల కోసం..

పై పెట్టుబడి పోగా మిగిలిన డబ్బులను నిత్యావసరాలు, ఈఎంఐల కోసం వినియోగించండి. అవసరంలేని లోన్లు ఎప్పుడూ తీసుకోకండి. ఇక విలువ తగ్గే ఆస్తులపై ఎప్పుడూ లోన్ తీసుకోకూడదు.  ఈ సేవింగ్స్ ప్లాన్ వల్ల మీకు రూ.30 వేల శాలరీ వస్తున్నా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.

Follow Us