EPFO Updates: చిటికెలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా… ఎలానో చూడండి..?
పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఇప్పటివరకు చాలా తతంగం ఉండేది. ఆన్‌లైన్‌లోకి వెళ్లి డీటైల్స్ అన్నీ పూర్తి చేసి బోల్డెన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చేంది. ఇక ఇప్పటినుంచి అలాంటి తలనొప్పి ఉండదు. చిటికెలో ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.

PF Money: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా మీ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే అప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింపుల్‌గా ఏటీఎం లేదా యూపీఐ విధానంలో పీఎఫ్ డబ్బులను తీసేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఈ నిర్ణయం ప్రకటించగా.. ఇప్పటివరకు ఇంకా అమలు కాలేదు. కానీ త్వరలో అది పూర్తిస్థాయిల్లో అమల్లోకి రానుంది. ఇది ఉద్యోగులకు పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ప్రక్రియ చాలా పెద్దగా ఉండేది. పీఎఫ్ వెబ్‌సైట్లోకి వెళ్లి అనేక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. అప్లోడ్ చేశాక మన అకౌంట్లోకి రావాలంటే నాలుగు రోజుల సమయం పట్టేపంది. కానీ ఇప్పుడు అలాంటి కష్టం ఉండదు. చిటికెలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది..?
పీఎఫ్ అకౌంట్లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, ఏటీఎం నెట్‌వర్క్‌లకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా పీఎఫ్ ఉద్యోగులు నేరుగా తమ అకౌంట్లోని డబ్బులను సింపుల్‌గా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏటీఎం లేదా యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవడానికి సెక్యూరిటీ పిన్, ఆధార్ ధృవీకరణ వంటి పద్దతులను ప్రవేశపెట్టే అవకాశ ఉంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకునేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈపీఎఫ్‌వో 3.0 అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అయతే ఉపసంహరణ పరిమితులు, షరతులు కొన్ని విధించే అవకాశముందని తెలుస్తోంది.
ఉపయోగాలు
-ఉద్యోగులకు పేపర్ వర్క్ ఉండదు
-అత్యవసర పరిస్ధితుల్లో వెంటనే తీసుకునే సదుపాయం
-డిజిటల్ ఇండియా బలోపేతం
-క్లెయిమ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పని తప్పడం
ఈపీఎఫ్ 3.0లో మార్పులు
పీఎఫ్ క్లెయిమ్‌లు, వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని సందర్శించే అవసరాన్ని తగ్గించేలా మార్పులు రానున్నాయి. ఇందుకోసం కొత్త డిజిటల్ ఇంటర్‌ఫేస్ తీసుకురానున్నారు. ఇక పీఎఫ్ అకౌంట్ స్థితి, బ్యాలెన్స్, ఇతర వివరాలు సులభంగా ట్రాక్ చేసేలా మార్పులు జరగనున్నాయి.




