OYO: ఒక గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. ఓయోలో కీలక మార్పులు..
ఓయో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి బ్యాడ్ న్యూస్ కాగా, మరొకటి గుడ్ న్యూస్. ఓయో తన టెక్నాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 600 మంది ఎగ్జిక్యూటీవ్‌లను తొలగించాలని..
ఓయో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి బ్యాడ్ న్యూస్ కాగా, మరొకటి గుడ్ న్యూస్. ఓయో తన టెక్నాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో 600 మంది ఎగ్జిక్యూటీవ్‌లను తొలగించాలని నిర్ణయించింది. అదే సమయంలో 250 సేల్స్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌లను నియమించుకోవాలని చూస్తుంది. యాప్ గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్ వంటి విభాగంలో కూడా టెక్నికల్ సిబ్బందిని కూడా తగ్గించనుంది. ఈ మేరకు కంపెనీ శనివారం ఒక ప్రకటించింది. ఓయో సంస్థలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. వీరిలో 10 శాతం ఉద్యోగులను తగ్గించుకుంటుంది. ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో మిగతా కంపెనీల మాదిరిగానే ఓయో కూడా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లుగా తెలుస్తోంది.
‘ఓయో ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, ఓయో వెకేషన్ టీమ్స్‌లో 600 ఉద్యోగులను తొలగించడం జరిగింది. రిలేషన్‌షిప్, మార్కెటింగ్ విభాగంలో కొత్తగా 250 మంది ఎగ్జిక్యూటీవ్‌లను తీసుకోవడం జరిగింది.’ అని ఓయో సీఈఓ రితేశ్ అగర్వాల్ తెలిపారు. అంతేకాదు, తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ఆయా విభాగాల్లో నియామకాలు చేపడితే.. తొలగించిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని రితేష్ తెలిపారు.
గత రెండేళ్లలో ఓయో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. 2020 డిసెంబర్‌లో కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఏకంగా 600 మందిని తొలగించి అందరినీ షాక్‌కు గురి చేసింది. కాగా, ఆర్థికమాంద్యం భయం నేపథ్యంలో దేశీయ కంపెనీల్లో ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బైజూస్, జొమాటో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు వీటి జాబితాలో ఓయో కూడా చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..