SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక.. రేపు ఆ సేవలు బంద్.. ఎందుకంటే..?
SBI Clients: భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గమనిక. శనివారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను
SBI Clients: భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు గమనిక. శనివారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కొంత సమయం పాటు ఉపయోగించలేరు. శని, ఆదివారాల్లో మొత్తం 300 నిమిషాల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO, YONO Lite, UPI వంటి వివిధ ఫీచర్లను ఉపయోగించలేరు. SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా ట్వీట్ చేసింది.
“మేము మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నందున కస్టమర్లు సహకరించాలని కోరుతున్నాం. 11 డిసెంబర్ 2021 ఉదయం 23:30 గంటల నుంచి 4:30 గంటల వరకు (300 నిమిషాలు) సాంకేతికతను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఈ సమయంలో INB/ Yono / Yono Lite / Yono Business / UPI సేవలు అందుబాటులో ఉండవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం. కస్టమర్లు సహకరించాలని కోరుతున్నాం “అని తెలిపింది.
SBI దేశవ్యాప్తంగా 22,000 శాఖలు, 57,889 కంటే ఎక్కువ ATMలతో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇదిలా ఉండగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌తో సహా డిజిటల్ లావాదేవీల కోసం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారుల నుంచి ఎటువంటి లావాదేవీ రుసుమును వసూలు చేయదని ప్రకటనలో తెలిపింది. మీడియా నివేదిక ప్రకారం.. భారతదేశపు అతిపెద్ద రుణ సంస్థ SBI 2017, సెప్టెంబర్ 2020 మధ్య జన్ ధన్ ఖాతాదారుల నుండి ₹ 164 కోట్లను మినహాయించిందని వెల్లడైంది.