Best Cars: మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేయొచ్చు.. మార్కెట్లోకి చీఫెస్ట్ కారు.. ఫీచర్లు చూస్తే స్టన్నింగ్
Nissan MPV: త్వరలో ప్రముఖ కార్ల సంస్థ నిస్సాన్ మరో కొత్త కారును ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫ్రెండ్లీ కారును తెస్తోంది. ఈ నెలలో దీనిని మార్కెట్లోకి తెచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ కార్ ఫీచర్లు ఇవే..

Nissan: కుటుంబ అవసరాల నిమిత్తం మధ్య తరగతి ప్రజలకు కారు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ కారు అంటేనే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మధ్యతరగతి ప్రజల దగ్గర అంత డబ్బులు ఉండవు. దీంతో కారు ఎందుకులే అని వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే మధ్య తరగతి ప్రజల కోసం ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ కార్లను తీసుకొస్తున్నాయి. ఎవరైనా కొనగలిగేలా రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరలో వచ్చే ఇలాంటి కార్లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందులో భాగంగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ త్వరలో భారత్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ కారును లాంచ్ చేయనుంది. వీటి వివరాలు తెలుసుకుందాం.
కాంపాప్ట్ MPV
నిస్సాన్ కాంపార్ట్ ఎంపీవీ కారును ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. డిసెంబర్ 18న ఈ కారును విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 7-సీటర్ సామర్థ్యంతో వస్తున్న ఈ కారు ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ది చేశారు. దీంతో పాటు ఇందులో అనేక అత్యాధునిక ఫీచర్లను జోడించారు.
ఫీచర్లు ఇవే
-మాడ్యులర్ 3-వరుసల సీటింగ్ లేఅవుట్
-వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ సెంటర్ స్టోరేజ్, స్లైడింగ్/రిక్లైనింగ్ సీట్లు
-7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
-ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
-72 bhp పవర్
-3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్
-5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో ఇంజిన్
-ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్
-కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్
-ఫ్రంట్ బంపర్‌లో C ఆకారపు యాక్సెంట్
ధర వివరాలు
ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.76 లక్షలుగా ఉండే అవకాశముంది. గతంలో 7 సీటర్ సామర్థ్యం గల రెనాల్ట్ ట్రైబర్ కారును నిస్సాస్ తీసుకొచ్చింది. దాని ధర తరహాలోనే ఈ కొత్త కారు ఉంటుందని చెబుతున్నారు.




