- Telugu News Photo Gallery Technology photos Do you know why there is this small hole next to the charging port on a smartphone
SmartPhone Tips:వారెవ్వా.. ఈ చిన్న రంధ్రంతో ఇన్ని లాభాలా..? స్మార్ట్‌ఫోన్ వాడే ఎవ్వరికీ ఇది తెలిసి ఉండదు..
మీ స్మార్ట్‌ఫోన్ క్రింది భాగంలో మీరు ఒక చిన్న రంధ్రాన్ని చూసి ఉంటారు. ఇది ఎంటుకు ఉంటుందనే విషయం మీలో చాలామందికి తెలియదు. ఈ చిన్న రంధ్రంలో ఉండే మైక్రోఫోన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Dec 12, 2025 | 4:07 PM

ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. అంతగా స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైంది. ఒక స్మార్ట్‌ఫోన్ మన చేతుల్లో ఉంటే చాలు.. ప్రపంచమే మన చేతుల్లో ఉందనే భావన ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు గంటలు గంటలకు ఫోన్లలోనే గడుపుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లోకి విభిన్న రకాల డిజైన్లతో కళ్లు చెదిరే ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు కొత్తగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ ప్రియులు పాత ఫోన్లను విక్రయించి కొత్త ఫోన్లను కొనేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

మొబైల్ ఫోన్‌లో మీరు ఛార్జింగ్ పోర్ట్ పక్కన చిన్న రంధ్రం చూసే ఉంటారు. ఇది ఎందుకు ఉంటుందనే డౌట్ మీకు వచ్చిందా. ఈ చిన్న రంధ్రం మీ కాల్స్, ఆడియో, వీడియో నాణ్యతకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు లేదా వాయిస్, వీడియో రికార్డింగ్ సమయంలో మీ వాయిస్ స్పష్టంగా వినపబడానికి ఈ మైక్ సహాయపడుతుంది.

ఇక కొన్ని ఫోన్లలో ఈ చిన్న రంధ్రం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఉపయోగపడుతుంది. మీరు ట్రాఫిక్, జర్నీలో ఉన్నప్పుడు గాలి, శబ్దం వినపడకుండా ఫిల్టర్ చేస్తుంది. మరికొన్ని ఫోన్లలో ఈ చిన్న రంధ్రంలో రెండో మైక్రోఫోన్ ఉంటుంది. ఇది ఆడియో క్వాలిటీని మరింత పెంచుతుంది.

మనం చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడే సమయంలో కింద అంచు మన నోటికి దగ్గరగా ఉంటుంది. దీని వల్ల మీ వాయిస్ మరింత స్పస్టంగా వినపడుతుంది. అందుకే ఈ చిన్న రంధ్రంలో మైక్రోఫోన్ అమర్చుతున్నారు. కొంతమందికి ఇది తెలియక ఆ రంధ్రం ఉపయోగపడదని అనుకుంటారు.




