5th Class Admissions 2026: పేదింటి పిల్లలకు గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు వచ్చే ఏడాది జనవరి 21, 2026వ తేదీ వరకు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు వచ్చే ఏడాది జనవరి 21, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపికైన విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ రాత పరీక్ష 2026 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
అయితే విద్యార్ధులు వరుసగా 4, 5, 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 2026 ఆగస్టు 31వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 11 ఏళ్ల నుంచి 17 ఏళ్లు ఉండాలి. TGSWREI, TGTWREI , MJPTBCWREI, TREI విద్యా సంస్థలు ఉమ్మడిగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఆయా సంక్షేమశాఖల వెబ్‌సైట్‌లు సందర్శించాలని TGSWREI Society కోరింది. అదనపు సమాచారం కోసం 040-23391598 (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), 8333800221 (టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), 040-23328266 (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), 040-24734899 (టీజీఆర్‌ఈఐఎస్) ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








